వంగవీటి రాధా... జనసేన లోకి జంప్ !?

వంగవీటి రాధా... జనసేన లోకి జంప్ !?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎపుడు ఏం జరుగుతుందో అని జనంతో పాటు నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ హఠాత్తుగా ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు.

పార్టీ కార్యక్రమంలో విజయవాడలో ఉన్న పవన్ కల్యాణ్ తో రాధా సమావేశమయ్యారు. టీడీపీ పూర్తిగా ఓడిపోవడంతో హోప్స్ వదిలేసుకున్న వంగవీటి రాధా 2024 పోరును ఇప్పటి నుంచే మొదలుపెట్టిన పవన్ తో కలిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం కులాన్ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా కాపులను అనవసరంగా దూరం పెట్టి నష్టపోయామని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి సామాజిక వర్గం అండ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగమే రాధాతో సమావేశం అని అంటున్నారు.

రహస్యంగా జరిగిన ఈ భేటీ గురించి ఆలస్యంగా సమాచారం బయటకొచ్చింది. ఒకటి రెండు రోజుల్లో వంగవీటి రాధా జనసేనలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

గత ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుందని భావించిన వంగవీటి రాధా ఆ పార్టీలో చేరారు. అందుకే పోటీ చేయకపోయినా ఏదైనా మంచి నామినేటెడ్ పదవిలో ఉండొచ్చని భావించారు. తెలుగుదేశం ఓడిపోవడంతో భవిష్యత్ రాజకీయ చిత్రం మారిపోతంది. ఈ నేపథ్యంలో రాధా కొత్త దారి వెతుక్కుంటున్నారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ పార్టీని వీడిన నేపథ్యంలో వంగవీటి జనసేనలో చేరడం పార్టీకి నష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English