'ఇలా చేస్తే చంద్రబాబు పోయాక పవనే సీఎం'

'ఇలా చేస్తే చంద్రబాబు పోయాక పవనే సీఎం'

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ పోస్టులు పెడుతూనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడిగా పేరొందిన ఆయన తెలుగుదేశం పార్టీపై, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్నో రకాలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన నోటికి మరింత పని చెబుతున్నారు. పదే పదే చంద్రబాబుపై పోస్టులు పెడుతూ ఏకి పారేస్తున్నారు. అయితే, తాజాగా ఆయన దృష్టిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పెట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ ఇద్దరికీ ముడి పెడుతూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

‘‘నాకన్నా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్‌కు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో పవన్ గెలవలేదని, మాములుగా తాగే రెండు పెగ్గులకి మరో రెండు కలిపికొట్టి నా విషాదాన్ని మిత్రులతో పంచుకున్నాను. అప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మీద, జనసేన పార్టీ మీద బెంగతో చచ్చిపోతున్నాను. ఏం చేస్తే 2024 నాటికి పార్టీకి, పవన్‌కు రాజకీయపునర్జీవం వస్తుంది అనే విషయంపై నాకున్న మూడు దారుల స్ట్రాటజీ ఇక్కడ పెడుతున్నాను’’ అని మూడు ప్రణాళికలను ప్రస్తావించారు. అంతేకాదు, చివరిలో చంద్రబాబు పోతే పవనే సీఎం అంటూ బాంబు పేల్చారు.

‘‘మొదటి దారి: తెలుగుదేశం పార్టీ ఎలాగూ కనుమారుగైపోతొంది గనక, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి అంటే, జనసేన గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుతో బలపడి. మానవవనరుల ఏర్పాటు చేసుకోవాలి. క్యాడర్ నిర్మాణం జరగాలి. జీరో బడ్జెట్ బెస్ట్ పాలిటిక్స్ అంటున్నారు గనక ప్రజల నుంచీ సానుభూతిపరుల నుంచీ తగినంత ఆర్థికవనరులు జమచేసుకోవాలి. కాపు ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లాలే కాకుండా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాధ్ర, రాయలసీమల్లో కూడా ఫోకస్ పెట్టాలి.

 కనీసం 50-60 నియోజకవర్గాలలో లీడర్ షిప్‌ను గుర్తించి, ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాల దిశగా పని చేసేలా చెయ్యాలి. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందకపోయినా, అమలు సరిగ్గా కాకపోయినా,అవినీతి జరిగినా లోకల్ గా ప్రశ్నించి ఉద్యమాలు చేసే స్థాయిలో వీళ్ళు ఉంటే, ఆటోమేటిక్ గా జనసేన నుంచీ ఎమ్మెల్యేలుగా వీళ్ళే ప్రాజెక్ట్ అవుతారు. జనసేన పార్టీ ప్రజల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీలైనన్ని సార్లు ఈ నియోజకవర్గాలను విజిట్ చేస్తూ, రాష్ట్ర స్థాయి ఉద్యమాలు సమీక్షలు చేస్తే చాలు.’’

‘‘రెండోదారి: బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసి, వాళ్ళు ప్రత్యామ్నాయం గా ఎదగాలని ఆంధ్రప్రదేశ్‌లో ట్రైచేస్తున్నారు. కానీ ఆపార్టీలో జనాకర్షణ ఉన్న నాయకులు లేరు. జనసేనకు బీజేపీ లో విలీనం చేసేసి,పవన్ కళ్యాణ్ బీజేపీ పగ్గాలు పట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆర్ధిక,మానవవనరుల గురించి ఆలోచన అవసరం లేదు. ఘర్షణ,పోరాట దీక్షలు అవసరం లేదు. ఈజీగా లైఫ్ లో సక్సెస్ఫుల్ రాజకీయనాయకుడు అయిపోతాడు. అదృష్టం వరిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కాకపోయినా ఎదో ఒక రాష్ట్రానికి గవర్నరో, దేశానికి ఉపరాష్ట్రపతో అయిపోతాడు.’’

‘‘మూడోదారి: చంద్రబాబు బలహీనంగా ఉన్నాడు. తెలుగుదేశం ఉంటుందో ఊడుతుందో తెలీదు. కమ్మలు తెప్పటగలేస్తున్నారు. కాపులు పార్టీని వదిలేసే ప్రమాదం కనిపిస్తోంది. లోకేష్ ను భవిష్యత్తుగా ఉహించుకోవడానికి పార్టీవాళ్లకే కష్టంగా ఉంది. ఈ టైంలో కాపుల్ని మల్లేసుకొచ్చే గొర్రెల కాపరిలా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే...తెలుగుదేశంలో నెంబర్ టూ పొజిషన్ గ్యారంటీ. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లకు, చంద్రబాబు పోయేనాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి.. ఇది నా ప్రణాళిక...ఏమంటారు?’’ అంటూ కత్తి మహేశ్ చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English