‘తిక్కవరపు’ బ్లాక్‌ మార్కెట్‌

‘తిక్కవరపు’ బ్లాక్‌ మార్కెట్‌

2014 ఎన్నికలలో ఎవరు గెలుస్తారోగాని, విశాఖపట్నం ఎంపి సీటు కోసం కాంగ్రెసు పార్టీలో ఇద్దరి మధ్య రణ రంగం జరుగుతున్నది. ఒకరు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి అయితే ఇంకొకరు దగ్గుబాటి పురంధరీశ్వరి. ‘విశాఖ నాదే’ అని కొన్నాళ్ళ నుంచి తిక్కవరపు చేస్తున్న హంగామా చిరాకు పుట్టిస్తున్నది ఆ నియోజకవర్గ ప్రజలకే. కాంగ్రెసు పార్టీ ఎవరికి టిక్కెట్టు ఇస్తే వారే పోటీలో ఉంటారు. కాని తిక్కవరపు, తనకు టిక్కెట్టు ఖాయమయ్యింది అంటూ సిట్టింగ్‌ ఎంపి దగ్గుబాటి పురంధరీశ్వరిని వేరే చోటకి వెళ్ళమని సలహా పారేస్తున్నారు.

ఇది పురంధరీశ్వరికీ నచ్చడంలేదు. అయితే ఆమె హుందాగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్తకు కొంచెం కోపమొచ్చినట్టుంది. తిక్కవరపు ‘సిమెంట్‌ బ్లాక్‌ మార్కెట్‌’ కహానీని బయటపెట్టారు. సినిమా వారిని తీసుకు వెళ్ళి పనికిమాలిన బిరుదులు ఇస్తూ పబ్లిసిటీ తెచ్చుకుంటారనీ తిక్కవరపుపై మండిపడ్డారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటివారి విమర్శకు ఆందోళన చెందిన తిక్కవరపుగారు, ‘ఆయన తన భార్యను చూసి సంస్కారం నేర్చుకోవాలి’ అనేశారు. పనిలేక నిప్పు రాజేస్తే, అది తన కోకకే అంటుకున్నట్టు మారింది తిక్కవరపు వ్యవహారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు