జనసేన ఓటమి - నాగబాబు విశ్లేషణ

జనసేన ఓటమి - నాగబాబు విశ్లేషణ

రాష్ట్రం విడిపోయి  ఏపీ దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో 2014లో ఎన్నికలు వచ్చాయి. అప్పటి పరిస్థితుల వల్ల  రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అవసరం ఉంది. అప్పటి పరిస్థితుల్లో ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టకుండా ...  ఉన్న వారిలో క్లీన్ గా కనిపించిన చంద్రబాబుకు తన తమ్ముడు మద్దతు ఇచ్చాడు. అప్పటికే చంద్రబాబుపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే, వైసీపీ అధినేతపై ఉన్న అవినీతి ఆరోపణలతో పోల్చితే అవి చాలా తక్కువ, అందుకే బాబు మేలని పవన్ అభిప్రాయపడ్డారు అని నాగబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ మద్దతు ఇస్తే... ప్యాకేజీ మాట్లాడుకుని ప్రచారం చేశారని చాలా చవకబారు కామెంట్లు చేశారని నాగబాబు ఆవేదన వ్యక్తంచేశారు.  

 ఈసారి కూడా స్వార్థంతో లబ్ధి పొందడానికి అబద్ధాలు ప్రచారం చేశారు. ప్యాకేజీ గురించి అబద్ధపు ప్రచారాలు చేశారని నాగబాబు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ప్రజాదరణ చూసి వారు అసూయ పడ్డారన్నారు. టీడీపీ-జనసేన మధ్య ఏ సంబంధం లేకున్నా పొత్తు ఉందని అబద్ధం చెబుతూ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని విశ్లేషించారు నాగబాబు. మీడియా మద్దతు మాకు లేకపోవడంతో తాము ఎంత ప్రతిఘటించినా వారి ప్రచారమే జనంలోకి పోయిందన్నారు. ఈ ప్రచారం టీడీపికి కూడా లాభదాయకమే కాబట్టి టీడీపీ వాళ్లు వ్యూహాత్మక మౌనం పాటించారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక అన్ని అధ్యాయాలు ముగిశాయని, చంద్రబాబు ఈ ఐదేళ్లలో విపరీతమైన ప్రజా వ్యతిరేకత తెచ్చుకోవడం, మరోవైపు అదేసమయంలో జగన్ పై బాగా సానుభూతి పెరగడం తో వైసీపీ అడిగిన 'ఒక్కఛాన్స్' ను ప్రజలు వారికి ఇచ్చారన్నారు. గెలిచిన వారు గొప్పవారు కాదు, ఓడిన వారు చేతకాని వారు కాదని నాగబాబు వ్యాఖ్యానించారు. 2024లో ప్రజలు పవన్ ను సీఎం చేయాలని డిసైడ్ అయిపోయారని.. అంతలోపు వీరందరి సత్తా ఏంటో కూడా జనానికి తెలిసిపోతుందని నాగబాబు అన్నారు. ఈసారి జనసేన అధికారంలోకి రాదు, ఓటు ఎందుకు వేస్టు చేసుకోవాలని బలంగా నమ్మిన కొందరు ఇతర పార్టీలకు ఓట్లేశారని నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English