ఆ పదవి కోసం టీడీపీ నేతల పోటీ

ఆ పదవి కోసం టీడీపీ నేతల పోటీ

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి సంప్రదాయంగా లభించే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో కనీసం ఆ పదవి వచ్చినా గౌరవంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారట. పైగా కేబినెట్ హోదా ఉన్న పదవి కావడంతో దీనికోసం అధినేత వద్ద లాబీయింగ్ మొదలుపెట్టిన్లు టాక్. దీంతో మొన్న పార్లమెంరీ పార్టీ పదవులు పంపకం సమయంలో కేశినేని వ్యవహారం మాదిరిగా ఈ పదవి కోసం కూడా నేతల మధ్య పోరు మొదలవుతుందేమోనని చంద్రబాబు కూడా భయపడుతున్నారట.

ఇప్పటికే టీడీఎల్పీ, మండలిలో విపక్ష నేత, పార్టీ విప్, పార్లమెంటరీ పార్టీ పదవులను ప్రకటించిన టీడీపీ అధినేత ఇప్పుడు పీఏసీ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై విస్తృత కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయిదేళ్ల పదవీ కాలంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు ఇలా లెక్కలేసుకుని మరీ పదవుల పందారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు అధికారం కోల్పోవడంతో సొంత అనుకున్న వారికే పదవులు కట్టబెడుతున్నారు.

ఇటీవల పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్  ఎంపిక విషయంలో అదే పార్టీ, అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎంపీ బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక విపక్ష పార్టీకి లభించే పీఏసీ కమిటీ చైర్మన్ పదవి విషయంలో ఎటువంటి అసంతృప్తి బయటకు పొక్కకుండా అధినేత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి కోసం పార్టీలో పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు.

సభా వ్యవహారాలపై అవగాహన, ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పొప్పులను ఎత్తి చూపే అవకాశం ఈ కమిటీకి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పీఏసీ చైర్మన్ పదవి ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సందర్భాలు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్ పదవికి అనుభవజ్ఞుడైన ఎమ్మెల్యేను ఎంపిక చేయాలని అధినేత ఆలోచన.

ప్రస్తుతం ఈ పదవి కోసం టీడీపీలో పలువురు పోటీ పడుతున్నప్పటికీ.. పీజీవీఆర్ నాయుడు(గణబాబు), కరణం బలరామకృష్ణ, పయ్యావుల కేశవ్ మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు అచ్చెన్నాయుడు కూడా రేసులో  ఉణ్నారు. గంటా శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం నేపథ్యలో పరిశీలనకు తీసుకుంటారో లేదో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English