సొంత బలం మీకుందా హరీషుగారూ!

సొంత బలం మీకుందా హరీషుగారూ!

చంద్రబాబునాయుడు ఎన్నడూ సొంత బలంతో గెలవలేదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ విషయంలో ముమ్మాటికీ చంద్రబాబు మోసం చేశారనే హరీష్‌రావు అన్నారు. టిడిపి తెలంగాణపై స్పష్టత ఇచ్చామని చెప్పడంలో అర్థం లేదని, స్పష్టత ఇస్తే సీమాంధ్ర నేతలు సమైక్య నినాదం ఎందుకు జపిస్తారని హరీష్‌రావు ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజం.

కాని చంద్రబాబు సొంత బలంతో గెలవలేదనే నైతిక హక్కు హరీష్‌రావుకి లేదు. ఎందుకంటే, టిఆర్‌ఎస్‌ ఇప్పటివరకు సాధారణ ఎన్నికల్లో సొంత బలంతో నెగ్గిన దాఖలాలు లేవు. ఓసారి కాంగ్రెసు పార్టీతో, ఇంకోసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. 2014 ఎన్నికలలో ఎవరితో అన్నా టిఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోకుండా ఉంటేనే ఆ పార్టీ అసలు బలమేంటో తెలుస్తుంది. అది హరీష్‌రావు తెలుసుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు