ఎండ ఉంద‌ని...144 సెక్ష‌న్ విధించిన ప్ర‌భుత్వం

 ఎండ ఉంద‌ని...144 సెక్ష‌న్ విధించిన ప్ర‌భుత్వం

144 సెక్షన్‌ అంటే మ‌నుక వెంట‌నే గుర్గుకు వ‌చ్చేది...అల్లర్లు, ఆందోళనకర పరిస్థితులు ఎదురైతే వాటిని అదుపులోకి తెచ్చేందుకు...ప్ర‌జ‌లు గుమి గూడ‌కుండా ఉండేందుకు సంబంధిత ప్రభుత్వం జారీ చేసే ఆదేశం. స‌హజంగా ఇలా ఆందోళ‌న విష‌యంలో తెర‌మీద‌కు వ‌చ్చే 144 సెక్షన్...తాజాగా `ఆందోళ‌నక‌ర ప‌రిస్థితుల‌` కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తోంది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించడ‌మే ఈ చ‌ర్చ‌కు కార‌ణం.   కానీ బీహార్‌లోని గయలో ఈ ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో తిరగడాన్ని బ్యాన్ చేశారు.

బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్, గయ, నవాడా జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని రోజులుగా గయలో అత్యధికంగా 46 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వచ్చాయి. ఈ ఎండల కారణంగా వడదెబ్బకు గురై 184 మంది మృత్యువాత పడ్డారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజల సంచారంపై బీహార్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఈ నెల 22 వరకూ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప‌రిణామం తాజాగా చ‌ర్చనీయాంశంగా మారింది.

ఇదిలాఉండ‌గా, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ వాయు మరింత బలహీనపడింది. గత గురువారమే అది తీరం దాటుతుందని భావించినప్పటికీ.. మంగళవారం ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయు ప్రభావంతో గుజరాత్‌లో విస్తారమైన వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఈ క్రమంలో సహాయ చర్యలు చేపట్టేందుకు ఐదు జాతీయ విపత్తు సహాయ బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్) సిద్ధమయ్యాయి. వాయు తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చని..అయినా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాన్ కార‌ణంగా దేశంలో వేడి గాలుల ప్ర‌భావం త‌గ్గ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English