కొట్టుకు చచ్చే క్రికెట్ ఫ్యాన్స్.. వీళ్లను చూడండి

కొట్టుకు చచ్చే క్రికెట్ ఫ్యాన్స్.. వీళ్లను చూడండి

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు కొందరు అభిమానులు ఎక్కడ లేని ఎమోషన్ తెచ్చేసుకుంటారు. దాన్ని మ్యాచ్ లాగా కాకుండా యుద్ధం లాగా చూస్తారు. పరస్పరం విద్వేషాలు చల్లుకుంటూ ఉంటారు. నిజానికి మామూలుగా చూస్తే ఇండియాలో అయినా.. పాకిస్థాన్‌లో అయినా సగటు ప్రజలు మంచోళ్లే. వారిలో ఏ ద్వేష భావం ఉండదు.

కానీ రాజకీయాల కోసం వాళ్లలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. కొందరు అతిగా స్పందించి మిగతా వాళ్లనూ ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంటారు. మొన్నటి భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఇలా చాలామంది పరస్పరం ద్వేష భావాల్ని చూపించారు. ఇలాంటి తరుణంలో కొందరు మాత్రం హుందాగా ప్రవర్తించారు. భారత్-పాక్ అభిమానులు తమ దేశ జెండాలతో కలిసి ఫొటోలకు పోజులివ్వడం.. స్టేడియంలో కూడా కలిసి మెలిసి వ్యవహరించడం చూశాం.

ఒక పాకిస్థాన్ అభిమాని భారత జాతీయ గీతం ‘జగనణమన’ను ఆలపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. మరోవైపు ఓ జంట రెండు దేశాల మధ్య శాంతి కోసం విచిత్రమైన శైలిలో దుస్తులు ధరించి స్టేడియానికి వచ్చింది. వాళ్లిద్దరూ భార్యాభర్తలే. ఉంటున్నది కెనడాలో. ఐతే భర్తది పాకిస్థాన్ కాగా.. భార్యది ఇండియా. భారత్, పాకిస్థాన్ జెర్సీల్ని మిక్స్ చేసిన జెర్సీలతో వీళ్లిద్దరూ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియానికి వచ్చారు. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వేష భావం వద్దని.. శాంతి కోసం ప్రయత్నిద్దామని సందేశం ఇచ్చేందుకే వీళ్లిద్దరూ ఇలా కెనడా నుంచి వచ్చి మ్యాచ్ చూశారు.

ఎంత కాదనుకున్నా పాకిస్థాన్ ఇండియా నుంచి విడిపోయిన దేశం. అది మన సోదర దేశమే. కానీ రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి.. ఉగ్రవాదులు తమ స్వార్థం కోసం జనాల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ద్వేషాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English