పాపం కియారా.. అంత కష్టపడిందట

పాపం కియారా.. అంత కష్టపడిందట

తెలుగులో తన తొలి సినిమానే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో చేసింది కియారా అద్వానీ. ఆ తర్వాత మరో పెద్ద హీరో రామ్ చరణ్‌తో కలిసి నటించింది. ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ సరసన నటించిన ‘కబీర్ సింగ్’తో పలకరించబోతున్న కియారా.. అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేస్తోంది.

ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న కియారా.. ఒకప్పుడు అవకాశాల కోసం అల్లాడిందట. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ డైరెక్టర్లను వేడుకుందట. తాను కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘ఫగ్లీ’ ఫ్లాప్ కావడంతో తన పరిస్థితి ఒకప్పుడు చాలా దయనీయంగా ఉండేదని కియారా చెప్పింది.

‘‘నా తొలి చిత్రం ‘ఫగ్లీ’. 2014లో రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత హీరోయిన్‌గా నాకు అవకాశాలు రాలేదు. చాలామంది దర్శకులను కలిసి సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడిగాను. కానీ ఎవ్వరూ కరుణించలేదు. చాలా బాధ పడ్డాను. చివరికి అనుకోకుండా నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’లో క్యామియో తరహా రోల్ దక్కింది. అది నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నేను చేసిన ‘మెషీన్’ సినిమా సరిగా ఆడకపోయినా.. అందులో ‘చీజ్ బడీ’ పాటతో అందరి దృష్టిలో పడ్డాను. నిజంగా నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది దక్షిణాది సినిమాలే.

మహేష్ బాబుతో చేసిన ‘భరత్ అను నేను’ సినిమాతో నా కెరీర్ గాడిన పడింది. సౌత్ సినిమాలతోనే నేను హీరోయిన్‌గా నిలదొక్కుకున్నను. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌ అనుకోకుండా చేశాను. అది నాకు అంత క్రేజ్ తీసుకొస్తుందని ఊహించలేదు’’ అని కియారా చెప్పింది. కియారా నటించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ ఈ నెల 21నే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English