ఖతర్నాక్ ట్వీట్ వేసి డెలీట్ చేసిన సానియా

ఖతర్నాక్ ట్వీట్ వేసి డెలీట్ చేసిన సానియా

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా ఉంది పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల తీరు. భారత్ చేతిలో చిత్తుగా ఓడిన తమ జట్టు ఆటగాళ్లను విమర్శించడం మాని.. తమ అసహనాన్ని సానియా మీర్జా మీద చూపిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లిన సానియా.. తన భర్త షోయబ్ మాలిక్‌ను కలిసింది.

అతడితో కలిసి హోటల్లో బస చేసింది. మధ్యలో ఒక రోజు తమ కొడుకును తీసుకుని డిన్నర్ కోసం బయటికి వెళ్లారు వీళ్లిద్దరూ. దీనికి సంబంధించిన ఒక వీడియోను పెట్టి పాకిస్థాన్ ఛానెల్ ఒకటి కథ అల్లేసింది. భారత్‌తో మ్యాచ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయకుండా భార్యతో కలిసి మాలిక్ విహార యాత్రలు చేస్తున్నాడని విమర్శించింది. దీనికి ఆల్రెడీ సానియా దీటుగా బదులిచ్చింది. మ్యాచ్ గెలిచినా ఓడినా జనాలు తిండి మాత్రం తింటారని.. తమ కొడుకును తీసుకుని రెస్టారెంటుకు వెళ్లడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించింది.

ఇది మ్యాచ్‌కు ముందు జరిగిన వ్యవహారం. మ్యాచ్‌లో ఏమైందో తెలిసిందే. పాక్ చిత్తుగా ఓడింది. మాలిక్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. పనిలో పనిగా సానియాను కూడా టార్గెట్ చేశారు. ఆమె పాకిస్థాన్ జట్టును ఓడించడానికే వచ్చిందని.. మాలిక్‌ను డీవియేట్ చేసిందని పాక్ అభిమానులు ధ్వజమెత్తారు. ఇండియన్ సినిమాల్లో సెక్సీ వేషాలు వేసిన వీణా మాలిక్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఒక అథ్లెట్ అయిన సానియా.. భర్తను తీసుకుని మ్యాచ్ ముందు రోజు జంక్ ఫుడ్ తినడానికి ఎలా వెళ్తుందని ప్రశ్నించిన ఆమె.. మద్యం కూడా సరఫరా చేసే షీషా ప్లేస్‌కి బిడ్డను ఎలా పట్టుకెళ్తుందని కూడా అంది.

దీనికి సానియా ఘాటుగా సమాధానం చెబుతూ ఒక ట్వీట్ చేసింది. తల్లి అయ్యాక కూడా పిల్లలు ఏమనుకుంటారో అని చూడకుండా మ్యాగజైన్‌కు పోజులు ఇచ్చిన వీణా తనకు సుద్దులు చెప్పడమా అని ఆ ట్వీట్లో సానియా ప్రశ్నించింది.నా బిడ్డ గురించి ఇంతగా ఫీలైపోతున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఐతే ఈ ట్వీట్‌ను కొన్ని నిమిషాల్లోనే డెలీట్ చేసిన సానియా.. తన కొడుకుని షీషా ప్లేస్‌కు తీసుకెళ్లనే లేదని..ఇక పాకిస్థాన్ ఆటగాళ్లు ఏం తినాలో డిసైడ్ చేయడానికి తానేమీ ఆ జట్టు డైటీషినయన్ కాదని అంటూ మరో ఘాటైన ట్వీట్ వేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English