ఆ ఎమ్మెల్యేల కంటే ముంబ‌యి రెడ్ లైట్ వాళ్లే బెట‌ర‌ట‌!

ఆ ఎమ్మెల్యేల కంటే ముంబ‌యి రెడ్ లైట్ వాళ్లే బెట‌ర‌ట‌!

క‌మ్యునిస్ట్ నాయ‌కుల విష‌యాల మీద అన‌ర్గ‌ళంగా మాట్లాడుతుంటారు. వారి విష‌య ప‌రిజ్ఞానాన్ని ప‌లువురు కొనియాడుతుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు సీపీఐ నారాయ‌ణ‌. ఆయ‌న మాదిరి చురుకు పుట్టేలా మాట్లాడే నేత‌లు పెద్ద‌గా క‌నిపించ‌రు. కోపం వ‌స్తే ఎంత మాట అనేందుకు వెనుకాడ‌ని ఆయ‌న‌.. తాజాగా పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన  ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి  ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఫిరాయింపుల‌కు వ్య‌తిరేకంగా సీపీఐ బ్యాక్ వాక్ నిర‌స‌న తెలుపుతుంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌జ‌లు ఎన్నుకున్న పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారే ఎమ్మెల్యేల కంటే ముంబ‌యి రెడ్ లైట్ ఏరియా వాళ్లే న‌మ‌య‌న్నారు. బీజేపీ స‌హా ఫిరాయింపుల్ని ఎవ‌రు ప్రోత్స‌హించినా రాజ్యాంగ ఉల్లంఘ‌నే అవుతుంద‌న్నారు. కేసీఆర్ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ రాష్ట్రాన్ని వెన‌క్కి తీసుకెళ్తున్నార‌ని మండిప‌డ్డారు.

టీఆర్ఎస్ లో ఉంటే నిధులు వ‌స్తాయ‌ని అనుకుంటే.. ఇక ఎన్నిక‌లు ఎందుకంటూ ఫైర్ అయిన నారాయ‌ణ తాజా వ్యాఖ్య‌లు మంట పుట్టిస్తున్నాయి. పార్టీ మారిన త‌మ‌ను ఉద్దేశించి ఎన్ని తిట్టినా కామ్ గా ఉంటున్న నేత‌లు సైతం.. నారాయ‌ణ మాట‌లు విన్నంత‌నే క‌స్సుమ‌న‌టం ఖాయం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English