జగన్ బాబు బాటలో నడవాలని కోరుకుంటున్నా

జగన్ బాబు బాటలో నడవాలని కోరుకుంటున్నా

అభిప్రాయ వ్యక్తీకరణలో టాప్ ర్యాంకు ఎప్పటికీ జేసీదే. ఏ టాపిక్ అయినా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంటారు. తాజాగా ఆయన జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ వాస్తవం అర్థం చేసుకున్నాడని, మోదీ సైన్యంతో తలపడలేను అని వాస్తవాన్ని గ్రహించాడని, అందుకే జాగ్రత్తగా ఉన్నాడన్నారు. అది జగన్ కి లబ్ధి చేకూర్చిందన్నారు.

ఓడినా గెలిచినా... సంబంధం ఉన్నా లేకపోయినా... అసెంబ్లీకి వస్తుంటారు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎంపీగా ఉన్నపుడు వచ్చారు, ఇపుడు ఓడినా వచ్చారు. అయితే, తెలుగుదేశం పార్టీ భారీ తేడాతో ఓడిపోవడం, జగన్ బలపడటంతో పాటు బీజేపీ నుంచి ఆఫర్లు రావడంతో జేసీ దివాకర్ రెడ్డి డైలమాలో పడ్డారు. మరో ఐదేళ్లు ఆగడమా? పార్టీ మారడమా? అన్న సమాలోచనలో ఉన్నారు. అందుకే ఆయన మాటల్లో కూడా తేడా కనిపిస్తోంది. ఈరోజు అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని, అయితే, వారి ఆఫర్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

నేను చిన్నప్పటి నుంచి జగన్ ను చూశాను, స్వయంగా అతని ఉద్రేక స్వభావం చూశాను.  అందుకే ఒకడు చెబితే ఆయన వినిపించుకోరని తాను భావించానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అభిప్రాయాలు అన్నాక మారుతాయనీ, బతికినంతకాలం ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ... జగన్ మారిన మనిషి అన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబును కూడా పొగిడిన రోజులు, విమర్శించిన రోజులు ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. గ్రామాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు ఎంతో ప్రయత్నించారని చెప్పిన జేసీ జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English