అమెరికాలో క‌ల‌క‌లం...పిల్ల‌ల్ని చంపి తానూ కాల్చుకున్న‌ తెలుగోడు

అమెరికాలో క‌ల‌క‌లం...పిల్ల‌ల్ని చంపి తానూ కాల్చుకున్న‌ తెలుగోడు

అగ్ర‌రాజ్యం అమెరికాలో నివ‌సిస్తున్న ఓ తెలుగు కుటుంబంలో దారుణం చోటుచేసుకుంది. అయోవా రాష్ట్రంలో ఒకే ఇంట్లో నలుగురు తెలుగువాళ్ల మృతదేహాలు లభ్యం కావడం, వారి మ‌ర‌ణం అనుమానాస్ప‌దంగా ఉండ‌టం స్థానికంగా నివ‌సిస్తున్న తెలుగు వారిలో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

చంద్రశేఖర్ అనే తెలుగు వ్య‌క్తి, ఆయ‌న భార్య‌ లావణ్య, మరో ఇద్దరు చిన్నారులు విగ‌త జీవులు అయ్యారు. వారి సొంత ఫ్లాట్‌లోనే జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

చంద్ర‌శేఖ‌ర్ గ‌త కొద్దికాలంగా వివిధ కార‌ణాల‌తో మాన‌సికంగా ఒత్తిడికి లోనై ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆయ‌న త‌న కుటుంబాన్ని అంత‌మొందించేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్తున్నారు. ముందుగా కుటుంబ స‌భ్యులను కాల్చి అనంత‌రం తానూ కాల్చుకొని చ‌నిపోయిన‌ట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

కాగా చంద్ర‌శేఖ‌ర్ ఇద్ద‌రు చిన్నారులు ర‌క్త‌పు మడుగులో ప‌డి ఉండ‌టం స్థానికుల‌ను క‌ల‌చివేసింది. ఘ‌ట‌న విష‌యం తెలుసుకొని సంఘ‌ట‌న స్థ‌లానికి చేరిన పోలీసులు నలుగురు శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉండడంతో అనుమానాస్పద మరణాలుగా కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English