కీలక నేతను జగన్ పట్టించుకోవట్లేదట..!

కీలక నేతను జగన్ పట్టించుకోవట్లేదట..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం.. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం.. అసెంబ్లీని సమావేశపరచడం చకచకా జరిగిపోయాయి. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పాలనపైనే దృష్టి సారించడంతో మిగిలిన విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓ ముఖ్య నేతను కూడా వైసీపీ అధినేత లైట్ తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 ఆయనే ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, మాజీ మంత్రి ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు. జగన్ ఈయనను పట్టించుకోకపోవడానికి అసలు కారణం ఈ ఎన్నికల్లో ఓడిపోవడమేననే టాక్ వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా ప‌ర్చూరులో మాత్రం ఆయ‌న స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. దీనికితోడు జగన్ వేవ్ భారీగా ఉంది. అయినా.. సీనియర్ నేత ఓడిపోవడంతో ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది.

మరోవైపు, ఆయన భార్య పురందేశ్వ‌రి విశాఖ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేశారు. కానీ, ఘోరంగా ఓడిపోయారు. వాస్తవానికి భార్య ఒక పార్టీలో ఉండ‌డం.. భ‌ర్త మ‌రో పార్టీలో ఉండ‌డాన్ని కూడా చాలా మంది సామాన్య ఓట‌ర్లు జీర్ణించుకోలేకపోయారు. ఇది కూడా ద‌గ్గుపాటి ఓట‌మి ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి అని చెప్పవచ్చు. ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే దగ్గుబాటికి స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారని కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ, ఆయన ఓటమితో అసలుకే ఎసరు వచ్చింది.

 టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారి ఆ పార్టీ త‌ర‌పున వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ద‌గ్గుపాటి ఈ ఎన్నిక‌ల‌కు ముందు కుమారుడు చెంచురామ్‌తో క‌లిసి వైసీపీలో చేరారు. ముందుగా కుమారుడినే వైసీపీ నుంచి పోటీ చేయించాల‌ని అనుకున్నా చివ‌ర్లో కుమారుడి పౌర‌స‌త్వం వివాదంలో ప‌డ‌డంతో చివ‌ర‌కు ఆయ‌నే బ‌రిలో ఉండాల్సి వ‌చ్చింది. గతంలో ద‌గ్గుపాటి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు ఆయ‌న‌కు ఉన్న సీనియార్టీ, జ‌గ‌న్ వేవ్‌, క‌మ్మ వ‌ర్గంలో చీలిక ఆయ‌న్ను గెలిపిస్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు చేసిన అభివృద్ధే ఆయనను గెలిపించింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English