తెలంగాణ‌లో గేట్లు ఎత్తేయ‌మ‌న్న అమిత్ షా!

తెలంగాణ‌లో గేట్లు ఎత్తేయ‌మ‌న్న అమిత్ షా!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సాధించిన అనూహ్య విజ‌యం తెలంగాణ‌లోని క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఒక‌టి గెలిస్తేనే ఎక్కువ అనుకుంటే.. ఏకంగా నాలుగు స్థానాల్లో విజయం సాధించ‌టంతో ఫ్యూచ‌ర్ ప్లాన్లు చాలానే తెర మీద‌కు వ‌చ్చేశాయి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో బీజేపీ బ‌లోపేతం అయ్యేందుకు కొత్త అవ‌కాశాల్ని ఇస్తోంది.

కేసీఆర్ లాంటి అధినేత‌ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో ప‌వ‌ర్ ఉండాల్సిందే. ఆ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది లేక‌పోవ‌టంతో బీజేపీలోకి చేరేందుకు నేత‌లు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ‌లో త‌మ పార్టీ త‌ప్పించి మ‌రో పార్టీ అన్న‌దే ఉండొద్ద‌ని.. ఖ‌తం ప‌ట్టించ‌ట‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ తీరుతో.. తెలంగాణ‌లో పెరుగుతున్న రాజ‌కీయ శూన్య‌తను బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం గుర్తించింది.

దీన్ఇన త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ.. కాంగ్రెస్ నేత‌లు బీజేపీలోకి చేరేందుకు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ విష‌యంపై క్లారిటీ తీసుకునేందుకు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కు.. అమిత్ షా స‌రికొత్త దిశానిర్దేశం చేశారు.

ద‌క్షిణాదిలో త‌మ స‌త్తా చాటాల‌ని త‌పిస్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితి దృష్ట్యా పార్టీలోకి వ‌చ్చే నేత‌ల‌కు సంబంధించిన అవ‌స‌రాల గురించి త‌మ దృష్టికి తీసుకురావాల‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. త‌లుపులు పూర్తిగా తెరిచివేయాల‌ని.. అంద‌రినీ చేర్చుకోవాల‌ని.. 2023లో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా ప‌ని  చేయాల‌ని ల‌క్ష్మ‌ణ్ కు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.  షా ఇచ్చిన గ్రీన్ సిగ్న‌ల్ తో రానున్న రోజుల్లో భారీ ఎత్తున పార్టీ నేత‌లు షిఫ్ట్ కావ‌టం ఖాయ‌మంటున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీలోకి కొత్త నేత‌లు వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేయాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. సో.. రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీలో కొత్త ముఖాలు పెద్ద ఎత్తున రావ‌టం కాయ‌మ‌న్న‌మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English