ఆ మ్యాచ్ జరగకపోతే 200 కోట్ల నష్టం

ఆ మ్యాచ్ జరగకపోతే 200 కోట్ల నష్టం

ఇప్పుడు క్రికెట్ ప్రేమికులందరి దృష్టీ ఆదివారం జరగబోయే భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ మీదే ఉంది. నిజానికి క్రికెట్ పట్ల పెద్దగా ఆసక్తి లేని వాళ్లు కూడా ఈ మ్యాచ్ మీద దృష్టిపెడతారు. రెండు జట్ల మధ్య దశాబ్దానికి పైగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగని నేపథ్యంలో ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌పై ఆసక్తి ఎన్నో రెట్లు పెరిగిపోయింది.

ఐతే ఈ ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వరుణుడు.. ఈ మ్యాచ్‌ను కూడా వదలకపోవచ్చని వార్తలొస్తున్నాయి. మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో శనివారం కూడా వర్షం పడింది. ఆదివారం కూడా వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చని అంటున్నారు. ఒకవేళ వర్షం మైదానాన్ని ముంచెత్తి మ్యాచ్ జరగకపోతే మాత్రం నష్టం భారీగానే ఉంటుంది.

ప్రపంచకప్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ ఇండియా గ్రూప్‌కు భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఏకంగా రూ.200 కోట్ల నష్టం వస్తుందట. ఇండియా ఆడే ప్రతి మ్యాచ్‌కూ కనీసం రూ.100 కోట్ల మేర ప్రకటనల రూపంలో ఆదాయం పొందుతోంది ఆ ఛానెల్. ఐతే పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై ఉన్న ఆసక్తి దృష్ట్యా ఆదాయం రెట్టింపు ఉంటుంది. ఈ మ్యాచ్ సందర్భంగా పది సెకన్ల ప్రకటనకు రూ.25 లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుందట. దీన్ని బట్టి ఆదాయాన్ని అంచనా వేయొచ్చు. మ్యాచ్ రద్దయితే స్టార్ ఇండియాకు మామూలు ఎదురు దెబ్బ కాదు.

ఇప్పటికే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దవడంతో వంద కోట్ల దాకా ఆదాయం కోల్పోయిన ఆ ఛానెల్‌కు.. భారత్-పాక్ మ్యాచ్ కూడా రద్దయితే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పేదేముంది? మరోవైపు ఈ మ్యాచ్‌పై వేల కోట్లలో బెట్టింగ్ జరిగే అవకాశాలుండటంతో వర్షం పడితే ఆ రకంగా కూడా చాలామందికి నష్టమే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English