చంద్రబాబు, పవన్ షాకయ్యే వ్యాఖ్యలు చేసిన సుమన్

చంద్రబాబు, పవన్ షాకయ్యే వ్యాఖ్యలు చేసిన సుమన్

నిన్ననే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమై ఓటమిపై సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పార్టీ ఓటమికి కారణాలు ఏంటో కచ్చితంగా అర్థం చేసుకోలేకపోతున్నామని చంద్రబాబు అన్నారు. అయితే, మరుసటి రోజే గోదావరి పర్యటనకు వెళ్లిన నటుడు సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలో టీడీపీ ఘోర ఓటమికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యకారణం అని సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఆగస్టులో కూడా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏమిటో అర్థం కావటం లేదని సుమన్ గుంటూరులో వ్యాఖ్యానించారు. తాజాగా ఇపుడు తెలుగుదేశం పార్టీ ఓటమికి ముఖ్య కారకుడు అని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తెలుగుదేశంపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇది చంద్రబాబుకు కొంతవరకు డ్యామేజ్ చేసిన మాట నిజమేనన్న వాదన కూడా ఉంది. అయితే, సుమన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం, జనసేన నేతలు ఎవరూ ఇంకా స్పందించలేదు.

మరోవైపు ఆయన సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకురావాలి అని జగన్ ను కోరారు. సినిమాను ఇక్కడికి తీసుకువచ్చి ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. జగన్ విజయం, ఆశ్చర్యకరమైనది, ఎందుకంటే... నేను పుట్టాక ఇన్ని సీట్లు ఒక పార్టీకి రావడం ఎన్నడూ చూడలేదని, ఘన విజయం అనే మాటకు సరిగ్గా సరిపోయే విజయం ఇది అని సుమన్ అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సుమన్ డిప్యూటీ సీఎంల ఎంపికపై కూడా వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం జరిగేలా డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయడం అభినందనీయం అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English