ఇండియాలో చెకింగ్ లేకుండా విమానంలోకి వెళ్లగలిగేది వీరు మాత్రమే..

ఇండియాలో చెకింగ్ లేకుండా విమానంలోకి వెళ్లగలిగేది వీరు మాత్రమే..

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడిని గన్నవరం విమానాశ్రయంలో భద్రత అధికారులు చెక్ చేయడంపై రాద్ధాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎంలకు ఇలాంటి అవకాశం లేదని కేంద్రవర్గాలు చెబుతున్నాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమాచారం ప్రకారం 32 రకాల వీఐపీలకు ఇలాంటి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

మినహాయింపు వీరికే..

1. భారత రాష్ట్రపతి
2. ఉప రాష్ట్రపతి
3. ప్రధాన మంత్రి
4. రాష్ట్రాల గవర్నర్లు
5. మాజీ రాష్ట్రపతులు
6. మాజీ ఉప రాష్ట్రపతులు
7. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)
8. లోక్ సభ స్పీకర్
9. కేబినెట్ హోదా ఉన్న కేంద్ర మంత్రులు
10. రాష్ట్రాల ముఖ్యమంత్రులు
11. రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు
12. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు
13. లోక్ సభ, రాజ్యసభల్లోని ప్రధాన ప్రతిపక్ష నేతలు
14. భారత రత్న అందుకున్నవారు
15. ఇతర దేశాల రాయబారులు, హైకమిషనర్స్, వారి జీవిత భాగస్వాములు
16. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
17. చీఫ్ ఎలక్షన్ కమిషనర్
18. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
19. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్ సభ ఉప సభాపతి
20. కేంద్రమంత్రివర్గంలోని స్వతంత్ర హోదా గల మంత్రులు
21. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
22. కేబినెట్ సెక్రటరీ
23. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు
24. జనరల్ లేదా అందుకు సమానమైన ర్యాంక్ ఉన్న దళాధిపతులు
25. హైకోర్టు చీఫ్ జస్టిస్
26. కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు
27. కేంద్ర పాలిత ప్రాంతాల ఉప ముఖ్యమంత్రులు
28. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), లోక్ సభ స్పీకర్, కేబినెట్ హోదా ఉన్న కేంద్ర మంత్రులకు సమాన హోదా గల ఇతర దేశాల అధికారిక అతిథులు
29. దలైలామా
30. ఎస్పీజీ భద్రతలో ఉన్నవారు.
31. రాష్ట్రపతి జీవిత భాగస్వామి ఒక్కరే ప్రయాణిస్తున్నా కూడా దేశంలోని అన్ని పౌరవిమానాశ్రయాల్లో నేరుగా వెళ్లొచ్చు.
32. దేశ మాజీ ప్రధానులు

ఇలాంటి మినహాయింపు ఉన్న వ్యక్తులతోపాటు వారి జీవితభాగస్వాములు కూడా ప్రయాణిస్తుంటే వారికీ ఈ మినహాయింపు వర్తిస్తుంది. మినహాయింపు ఉన్నవారు లేకుండా జీవిత భాగస్వాములు ఒక్కరే వెళ్తే ఈ మినహాయింపు వర్తించదు. అలా కేవలం రాష్ట్రపతి జీవిత భాగస్వామికి మాత్రమే మినహాయింపు ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English