పాకిస్థాన్ క్యాంపులో సానియా.. ఊరుకుంటారా?

పాకిస్థాన్ క్యాంపులో సానియా.. ఊరుకుంటారా?

పాకిస్థానీ అయిన షోయబ్ మాలిక్‌ను పెళ్లాడటం వల్ల సానియా మీర్జా ఎంతగా వ్యతిరేకత ఎదుర్కొన్నదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటో పెడితే చాలు.. కింద వేలల్లో నెగెటివ్ కామెంట్లు పడిపోతాయి. ఇక ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ వస్తే చెప్పాల్సిన పని లేదు. హేట్ కామెంట్లు కుప్పలు కుప్పలుగా వచ్చి సానియా సోషల్ మీడియా అకౌంట్లో పడిపోతాయి.

చాలాసార్లు సానియా పట్టించుకోనట్లే ఉంటుంది కానీ.. కొన్నిసార్లు ఫ్రస్టేషన్ బయట పెట్టేస్తుంటుంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వస్తే తాను ఒక వారం పాటు తన ట్విట్టర్ అకౌంట్‌ను మూసేస్తుంటానని ఆమె గతంలో ఒకసారి చెప్పింది. ఆదివారం ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ తలపడుతుండటంతో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రెడీ నెటిజన్లు సానియాను నెటిజన్లు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు.

ఐతే వాళ్లను రెచ్చగొట్టడానికా అన్నట్లుగా సానియా ఇప్పుడు పాకిస్థాన్ క్యాంపులోకి వెళ్లింది. ప్రస్తుతం సానియా ఇంగ్లాండ్‌లోనే ఉంది. పాకిస్థాన్ జట్టు బస చేస్తున్న హోటల్‌కు వెళ్లి భర్త షోయబ్ మాలిక్‌తో గడుపుతోంది. ఆదివారం మ్యాచ్ చూడటానికే సానియా ఇంగ్లాండ్‌కు వెళ్లి ఉండొచ్చు. అక్కడికి వెళ్లాక భర్త దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉంటుంది? కానీ జనాలకు ఇదేమీ పట్టదు కదా. కొంత కాలంగా భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో భారత అభిమానులు ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టుకు మద్దతుగా నిలవాల్సిన సానియా.. వెళ్లి ప్రత్యర్థి జట్టు హోటల్లో ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పాక్ టీం హోటల్లో సానియా ఉన్న ఫొటో మీద హేట్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. సానియా వ్యక్తిగత జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు కానీ.. ఈ సమయంలో ఆమె కూడా కొంచెం సంయమనం పాటించి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English