బ్రా తీసేసి పాక్‌కు సమాధానం చెప్పిన పూనమ్

బ్రా తీసేసి పాక్‌కు సమాధానం చెప్పిన పూనమ్

ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 16 భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మామూలుగానే దాయాదుల మధ్య జరిగే పోరు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. అలాంటిది ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే ఊహించని రీతిలో రెస్పాన్స్ ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ కోసం ఉంచిన టికెట్లు గంటల వ్యవధిలోనే అయిపోయాయి. రెండు దేశాల మధ్య జరగనున్న మ్యాచ్‌ను.. కొందరు అతిగా వాడుకుంటున్నారు. భారత్ - పాక్ మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు.

 ఇందులో పాక్ అభిమానులు, మీడియా బాగా ఓవర్ యాక్షన్ చేస్తోంది. నాలుగు రోజుల క్రితం విడుదలైన యాడ్‌పై ప్రముఖ మోడల్, బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే స్పందించింది. ట్విట్టర్ వేదికగా దీనిపై ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘నిన్న నా వాట్సప్‌లో ఈ పాకిస్థానీ యాడ్‌ను చూశాను. మన హీరోపైన వాళ్లు కామెడీ వీడియో చేశారు. డియర్ పాకిస్థాన్ అది కరెక్ట్ కాదు. మీ యాడ్‌పై నా ఆన్సర్ ఇదే’’ అంటూ తన బ్రా తీసేని ‘‘డీ కప్స్ ఉండగా.. మీరు టీ కప్పుల దగ్గరే ఎందుకు ఆగిపోయారు..? డబుల్ డీ కప్స్.. వీటిని వాడుకుని ఇందులో మీరు చాయ్ తాగండి’’ అని అదిరిపోయే పంచ్ ఇచ్చింది.

 ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన మీడియా ఓవర్ రియాక్ట్ అవుతోంది. నాలుగు రోజుల క్రితం జాతీయతను వాడుకుని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ యాడ్‌ను రూపొందించింది. ఇటీవల పాక్‌లో ఉంటున్న ఉగ్రవాదులపై భారత్ సర్జికల్ దాడులు జరిపిన సమయంలో హైలైట్ అయిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను కించపరుస్తూ ప్రకటనను క్రియేట్ చేసింది. 30 సెకన్లపాటు నిడివి ఈ వీడియోను పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ రూపొందించింది. ప్రసుత్తం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఈ యాడ్‌లో కమాండర్ అభినందన్ పోలికలతో ఉన్నవ్యక్తి భారత జట్టు జెర్సీ ధరించి టీ తాగుతూ కనిపిస్తుంటాడు. అతడిని పాక్‌కు చెందిన విచారణాధికారులు ప్రశ్నిస్తున్నట్లు చూపించారు. అయితే చివరగా అభినందన్ పాత్రధారి చేతిలోంచి టీ కప్‌ను లాక్కున్నట్లు చూపించారు. అంటే ప్రపంచకప్ పాకిస్థాన్ కైవసం చేసుకుంటుందన్నట్లు పరోక్షంగా చూపించారు. వాస్తవానికి ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ ఆదరణను పొందడంలో విఫలమవుతోంది. వర్షం కారణంగా వరుసగా మ్యాచ్‌లు రద్దు అవుతుండడంతో ఈ టోర్నీపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ - పాకిస్థాన్ మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English