విజయసాయిరెడ్డి ప్రకటనతో వైసీపీ నేతల్లో కదలిక

విజయసాయిరెడ్డి ప్రకటనతో వైసీపీ నేతల్లో కదలిక

ఏపీలోని 13 జిల్లాలు త్వరలో 25 జిల్లాలుగా మారబోతున్నాయన్న విజయసాయిరెడ్డి ప్రకటనతో పాలక వైసీపీలో నేతల్లో ఆశలు మొదలయ్యాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు, ఇతరత్రా పదవుల కోసం ఆశావహుల సందడి అప్పుడే మొదలైపోయింది. దీంతోపాటుగా కొత్త జిల్లాలకు వీలైతే తమ పూర్వీకుల పేర్లు పెట్టించుకోవాలని ప్రయత్నిస్తున్న నేతలూ కనిపిస్తున్నారు.

కొన్ని జిల్లాలకు చారిత్రక నేపథ్యం ఆధారంగా పేర్లు పెట్టినా మరికొన్నిటికి మాత్రం ఆ ప్రాంతానికి సేవలందించినవారి పేర్లు పెట్టే అవకాశాలు ఉండడంతో ఆ దిశగా పైరవీలు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు.

ఈరోజు విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటవుతాయని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్నామన్న భావనతో ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. గ్రామ సెక్రటేరియట్ల నిర్మాణం జరుగుతోందని... ఇందులో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయని విజయసాయి చెప్పారు. పాదయాత్ర సమయంలో జగన్ అనేక హామీలను ఇచ్చారని... వాటన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

వైసీపీ పార్టీ కార్యకలాపాలు ఇటీవల తగ్గిపోయాయని అందరూ అనుకుంటున్నారని... పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాదు నుంచి అమరావతికి తరలిస్తున్నామని... కొత్త కార్యాలయం ఏర్పాటు కాగానే పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని చెప్పారు. ప్రతి శని, ఆదివారాల్లో కార్యకర్తలకు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English