ఆర్కేకు కీల‌క ప‌ద‌వి...టీడీపీని కెలికేందుకేనా?

ఆర్కేకు కీల‌క ప‌ద‌వి...టీడీపీని కెలికేందుకేనా?

పార్టీ కోసం శ్ర‌మించిన‌ప్ప‌టికీ, కీల‌క స‌మ‌యంలో పోరాటం చేసిన నేప‌థ్యం ఉన్న‌ప్ప‌టికీ...ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో త‌న మంత్రివ‌ర్గంలో ముఖ్యులు, కీల‌క‌మైన నేత‌ల‌కు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంత్రి ప‌ద‌వి కేటాయించ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే, అలాంటి నేత‌ల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు జ‌గ‌న్‌. కేబినెట్ లో స్థానం దక్కలేదని ఆవేదన చెందుతున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరినే ఏపీ సీఎం జగన్ బుజ్జగిస్తూ వస్తున్నారు. పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్, తాజాగా మ‌రో ముఖ్య‌నేత‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే నిర్ణ‌యం తీసుకున్నారు.  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, అప్ప‌టి మంత్రి నారా లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు.మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆర్కే గెలుపొందారు. దీంతో జ‌గ‌న్ హామీ ప్ర‌కారం ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని భావించినా కొన్ని సమీకరణాల కారణంగా కుదరలేదు. దీంతో ఆళ్లకు సీఆర్డీఏ చైర్మన్ పదవి అప్పగించాలని జగన్ భావించినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆర్కేకు జ‌గ‌న్ ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా సీఆర్డీఏ ప‌రిధిలో తెలుగుదేశం పార్టీ నేత‌ల యొక్క వివాదాస్ప‌ద అంశాల‌ను తెర‌మీద‌కు తేవాల‌నే ల‌క్ష్యం ఉందంటున్నారు.

మంగ‌ళ‌గిరి ఎన్నిక‌ల ప్ర‌చారం హోరాహోరీగా సాగిన సంగ‌తి తెలిసిందే. వైఎస్‌ షర్మిల, మోహన్ బాబు, లక్ష్మి పార్వతి ఇలా ప‌లువురు నేత‌లు ప్ర‌చారం చేశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ ఇప్పుడు అనేక వలస పక్షులు మంగళగిరికి వస్తున్నాయి కానీ నా గెలుపును ఎవ్వ‌రూ ఆప‌లేరని ప్ర‌క‌టించారు.  సంక్షేమం, అభివృద్ధిలో పోటీ పడలేక అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారన్న లోకేష్‌.. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా మంగళగిరికి రూ.34 కోట్లు మంజూరు చేయించానని.. ఐటీ సంస్థలు తెచ్చి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించానని చెప్పారు. దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అయితే, ఆయ‌న‌కు బ‌దులుగా ప్ర‌జ‌లు ఆర్కేకే ఓటు వేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English