జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన‌లో ఓ రేంజ్‌లో హ్యాపీ

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన‌లో ఓ రేంజ్‌లో హ్యాపీ

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు ప్ర‌జా సంక్షేమ నిర్ణ‌యాలు తీసుకుంటూ వివిధ వ‌ర్గాల‌ను దృష్టిని ఆక‌ర్షిస్తున్న వైసీపీ అధినేత తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో కీల‌క ప్ర‌సంగం చేశారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో జగన్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ఫిరాయింపుల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఎవ‌రినీ పార్టీలో చేర్చుకోన‌ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించ‌డం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌ధానంగా జ‌న‌సేన పార్టీని రిలాక్స్ చేసిందంటున్నారు.

పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నానని జ‌గ‌న్‌ చెప్పారు. “కొందరు నన్ను అడిగారు. చంద్రబాబునాయుడుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే.. ఆయనకు 18 మందే ఉంటారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదు. లాగేద్దాం అన్నారు. నేను అప్పుడు వారికి ఓ చెప్పాను. అలా చేస్తే.. నాకూ ఆయనకు తేడా లేకుండా పోతుంది అని చెప్పాను. అటువంటిది ఎక్కడైనా జరిగితే.. ఆ పార్టీ నుంచి మేం తీసుకుంటే.. వారితో రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. రాజీనామా కాకుండా తీసుకుంటే.. వారిని వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరుతున్నా అధ్యక్షా.” అని  సీఎం వైఎస్ జగన్ అన్నారు.

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో జ‌న‌సేన పార్టీ ఊపిరి పీల్చుకుంద‌ని అంటున్నారు. ఎందుకంటే...పార్టీ ఫిరాయింపులకు ఎక్కువ భయపడింది ఆ పార్టీయే. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే, జగన్ ఫిరాయింపులకు నో అనడంతో జనసేన హ్యాపీగా ఉంది. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుందని విశ్లేషిస్తున్నారు. కాగా, జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో...తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును సైతం ప‌లువురు ప్ర‌స్తావిస్తుండ‌టం గ‌మ‌నార్హం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English