ఆ ముగ్గురు ఎంపీలు ‘ఔట్‌’

ఆ ముగ్గురు ఎంపీలు ‘ఔట్‌’

కాంగ్రెసు పార్టీకి ‘హ్యాండ్‌’ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపిలు వివేక్‌, రాజయ్య, మందా జగన్నాథంలు. వీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారని ఇప్పటికే ప్రచార సాధనాల్లో వార్తలు వినవచ్చాయి. జూన్‌ 2న ముహూర్తం నిర్ణయించుకుని, ఈలోగా కార్యకర్తలను, అనుచరులను టిఆర్‌ఎస్‌ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు.

ఎంపి వివేక్‌, కొందరు తెలంగాణ కాంగ్రెసు నేతలతోను, తన అనుచరులతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. డెడ్‌లైన్‌ ముగుస్తున్నదని, కాంగ్రెసు పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలేదు గనుక తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి ఆలోచించుకుంటున్నానని చెప్పారు ఎంపి వివేక్‌. మందా జగన్నాథం, రాజయ్య కూడా టిఆర్‌ఎస్‌లో చేరడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. వీరి రాకతో తమ పార్టీ బలోపేతం అవుతుందని టిఆర్‌ఎస్‌ భావిస్తున్నది. ముగ్గురు ఎంపిలు పార్టీ వీడుతున్నారని తెలిసినా కాంగ్రెసు పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టడంలేదెందుకో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు