ఈ బీహారోళ్ళున్నారే

ఈ బీహారోళ్ళున్నారే

బీహార్‌ ముఠా తగాదాలకు నెలవు. అక్కడి ముఠా తగాదాల గురించి, ఆయుధాలు అక్కడెంత తేలికగా దొరుకుతాయన్నదాని గురించి వింటుంటాం. హంతక ముఠాలు కూడా బీహార్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు దిగుమతి అవుతాయి. కాని బీహార్‌ విద్యార్థులు కూడా అలానే తగాదాలకు దిగుతారంటే ఎలా నమ్మగలం? నమ్మండి, ఇదిగో రుజువు. కాకినాడలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో బీహార్‌కి చెందిన విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులపై దాడి చేశారు. కళాశాలలో విద్యార్థులు రక్తమోడారు. 

బయటకు తెలిస్తే పరువు పోతుందని, విద్యా సంస్థ ఇమేజ్‌ పడిపోతుందని భావించి యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల డిమాండుతో, జరిగిన వాస్తవాల్ని గమనించి తగాదాలకు కారణమైన బీహార్‌ విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్‌ చేశార్ట. చదువుకోడానికొచ్చి, ఇవేం గొడవలు. విద్యార్థులా, వీధి రౌడీలా అనుకునేంతలా రౌడీయిజం ప్రదర్శించారు ఆ విద్యార్థులు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English