హెల్ప్ చంద్రబాబుది, కలిసింది జగన్ ని

హెల్ప్ చంద్రబాబుది, కలిసింది జగన్ ని

రాజకీయం అంటే అంతే. పవర్ ఉంటే ఒకలా లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తుంటారు. గత ఎన్నికల్లో తెలుగు ఆడపడుచు సుమలత పై పోటీ చేసిన కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడకు పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు ప్రచారం చేశారు. సినిమాల్లో హీరోగా ట్రై చేసి విఫలమైన నిఖిల్ గౌడ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే అది బెడిసికొట్టింది. జేడీఎస్ -కాంగ్రెస్ కలిసినా అక్కడ సానుభూతి బలంగా పనిచేసి ఓటర్లు సుమలత వైపు నిలిచారు. దీంతో సీఎం కొడుక్కి ఓటమి తప్పలేదు. కట్ చేస్తే ఆయన తాజాగా అమరావతిలో కనిపించారు.

అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ వైెఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఇంత సడెన్ గా ఆయనను ఇక్కడ చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎన్నికల ముందు కుమారస్వామి చంద్రబాబు తో జట్టుకట్టారు. ఆయన కొడుకు నిఖిల్ కోసం చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ నిఖిల్ అమరావతికి వచ్చి కలిసింది జగన్ ను. సీఎంను కలవడం తప్పేమీ కాదు గాని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారా లేదా అన్నది అనుమానం. ఆ వార్త బయటకు రాలేదు. అంటే జగన్ ను కలిసినపుడు చంద్రబాబును కలిసిన వార్త బయటకు వస్తే కలిసిన ప్రయోజనం కూడా నెరవేరేదేమో అని బయటకు చెప్పకపోయి ఉండొచ్చని కూడా అంటున్నారు. వాస్తవ మేంటో తెలియదు గాని ఈ కలయిక మాత్రం అందరికీ సర్ ప్రైజే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English