భారత్ ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే అన్ని సార్లు బట్టలిప్పేస్తుందట

భారత్ ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే అన్ని సార్లు బట్టలిప్పేస్తుందట

అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే బట్టలిప్పి తిరుగుతానని ప్రకటించి సంచలనం రేకెత్తించింది ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే. ఈ వ్యవహారం తర్వాత భారతీయులందరికీ బాగా పరిచయమైన ఆమె.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తన అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే పూనమ్.. తన అందాలను ఆరబోస్తూ ఉన్న ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. గతంలో ఎన్నో హాట్ వీడియోలను విడుదల చేసిన ఆమె.. తాజాగా మరో సంచలన ప్రకటన చేసి అందరినీ తన వైపు తిప్పుకుంది.

 ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపైనే దృష్టి సారించిన పూనమ్.. మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆసీస్‌తో జరిగిన వన్డేలో భారత్ విజయం సాధించడంతో పూనమ్ పాండే.. అటు క్రికెటర్లకు.. ఇటు తన అభిమానులకు అందాల విందు ఇచ్చింది. నలుపు రంగు డ్రెస్‌ వేసుకుని బెడ్ మీద పడుకున్న ఓ సెమీ న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. అంతేనా.. ఇకపై ప్రపంచకప్‌లో భారత్ ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే అన్ని సార్లు ఇలాంటి ఫొటోలనే విడుదల చేస్తానని ప్రకటించింది.

 రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో భారత్ తొమ్మిది లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. అందులో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాపై, రెండోది ఆస్ట్రేలియాపై ఆడి విజయం సాధించింది కోహ్లీ సేన. నాకౌట్ మ్యాచ్‌లు తీసేస్తే ఇంక టీమిండియా ఏడు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక, మిగిలిన మ్యాచ్‌లు గెలిస్తే పూనమ్ అన్నంత పని చేసేలానే ఉంది. ఎందుకంటే.. అమ్మడు ఈ మధ్య ఎక్కువగా బోల్డుగా కనిపించడానికే ప్రయత్నాలు చేస్తోంది. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 మొత్తానికి పూనమ్ అందాలను చూసేందుకైనా ప్రపంచకప్‌లో భారత్ అన్ని మ్యాచ్‌లు గెలవాలనుకునే వారు లేకపోరు అని చెప్పడంలో ఏమాత్ర సందేహం లేదు. మొదట్లో మోడలింగ్ రంగంలో మెరిసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో ‘లేడీ గబ్బర్ సింగ్,’ ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే సినిమాలు చేసింది. అయితే, ఇవి ఆమెకు ఏమాత్రం సంతృప్తిని మిగలచ్చలేదు. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుంది. సంచలన ప్రకటనలు చేయడం.. తన అందాలను చూపెడుతూ ఫొటోలు, వీడియోలు వదలడంతో పూనమ్ పాండే ప్రతి రోజూ నలుగురి నోళ్లలో నానుతూ ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English