సుష్మా స్వరాజ్ ఏపీ గవర్నరుగా ఎందుకు రాలేదు?

సుష్మా స్వరాజ్ ఏపీ గవర్నరుగా ఎందుకు రాలేదు?

కేంద్ర మంత్రి హర్షవర్థన్ చేసిన ఒక ట్వీట్ నిన్న ఏపీ పాలిటిక్సులో వేడిని పెంచింది. గవర్నరు నరసింహన్ దిల్లీ వెళ్లి అమిత్ షా‌తో భేటీ కావడం.. ఆ తరువాత కొద్దిసేపటికే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్విటర్ వేదికగా సుష్మకు శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే. ఏపీ గవర్నరుగా నియమితులైన విశిష్ఠ నేత సుష్మా స్వరాజ్‌కు అభినందనలు అంటూ సాక్షాత్తు కేంద్ర మంత్రే ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఆ వార్త అంతటా పాకింది.

సుష్మ నియామకం కరెక్టే అని అంతా అనుకున్నారు. అన్ని మీడియాలో ఈ వార్త వచ్చేసింది. అయితే... పార్టీ నుంచి వెంటనే వచ్చిన ఆదేశాలతో హర్షవర్థన్ ఆ ట్వీట్ తొలగించేశారు. దాంతో గందరగోళం మొదలైంది. ఆ గందరగోళానికి తెరదించేందుకు చివరకు సుష్మ మళ్లీ ట్వీట్ చేశారు. తనను ఏపీ గవర్నరుగా నియమించారన్న వార్త నిజం కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

అయినప్పటికీ ఈ విషయం ఇంకా చల్లారలేదు. నిప్పు లేకుండా పొగరాదని... హర్షవర్థన్ స్థాయి నేత ఊరికే విషయాన్ని అలా పబ్లిక్‌గా వెల్లడించరని ఇంకా చాలామంది నమ్ముతున్నారు. అయితే..  బీజేపీ మాత్రం ఈ విషయంలో కాస్త మార్పులు చేర్పులు చేయొచ్చు కానీ గవర్నరు మార్పు మాత్ర తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

నిజానికి తొలుత సుష్మను ఏపీ గవర్నరుగా అనుకున్నారని.. కానీ, ఏపీకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఆ రాష్ట్రానికి గవర్నరుగా పనిచేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో ఈసారి ఎన్నికల్లో పోటీకి, మంత్రి పదవికి దూరంగా ఉన్న ఆమె అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఏపీ గవర్నరుగా వచ్చేందుకు సుముఖత చూపలేదని తెలుస్తోంది.

ముఖ్యంగా అనారోగ్య కారణాల వల్ల... ఇంకా పూర్తిస్థాయి వసతులు లేని అమరావతిలో ఉండే కంటే మహారాష్ట్రకు గవర్నరుగా ముంబయిలో ఉండడం మంచిదని ఆమె అనుకున్నారట. ముంబయితో పోల్చితే వైద్య సదుపాయల పరంగా ఆంధ్రప్రదేశ రాజధానికి బాగా వెనుకంజలోనే ఉంటుంది. పార్టీ అధిష్ఠానం కూడా ఆమె అభిప్రాయంతో ఏకీభవించి నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English