అత్యాచారం కేసు పెట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

అత్యాచారం కేసు పెట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

ఆయనో ఎమ్మెల్యే.. ఆయన తనపై అత్యాచారం జరిపారంటూ ఓ మహిళ పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళా సంఘాల నిరసనలు.. ప్రతిపక్షాల ఆరోపణలతో దద్దరిల్లిపోయింది. తాజాగా ఆ ఎమ్మెల్యే అదే అమ్మాయిని వివాహమాడారు.

త్రిపురలోని దలాయికి చెందిన మహిళ ఈ ఏడాది మే 20న అగర్తలలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో సదరు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడని, తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కొంతకాలంగా తనతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారని, చివరికి వివాహం అనేసరికి నిరాకరించినట్లు సదరు మహిళ పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ మంజూరుకు దరఖాస్తు చేసుకున్న ధనుంజోయ్‌కు నిరాశ ఎదురైంది. దీంతో చేసేదేమీ లేక ఆమెను ఆదివారం వివాహం చేసుకున్నారు.

పెళ్లి విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. త్రిపురలోని రిమా వ్యాలీ ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనుంజోయ్‌ త్రిపురకు సదరు మహిళతో ఆదివారం వివాహం జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారని ఆ పార్టీకి చెందిన న్యాయవాది మీడియాకు తెలిపారు. భవిష్యత్‌లో పరస్పరం ఎలాంటి ఫిర్యాదులూ చేసుకోకూడదన్న ఒప్పందానికి వచ్చారని వెల్లడించారు. ఆ రకంగా ఈ అత్యాచారం కేసు పెళ్లితో ముగిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English