ఏంది బాబు.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేదా?

ఏంది బాబు.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేదా?

దారుణ ఓట‌మి త‌ర్వాత కూడా ఎన్నిక‌ల్లో ఓట‌మికి సంబంధించి నిజం ఏమిట‌న్న దానిపై బాబు స‌రిగా స‌మీక్షించ‌లేక‌పోయారా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. తాజాగా ఆయ‌న సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఎప్ప‌టిలానే గంట‌ల త‌ర‌బ‌డి సమావేశాన్ని నిర్వ‌హించిన త‌ర్వాత పార్టీ ఓట‌మిపై కార‌ణాల్ని స‌మీక్షించారు. చివ‌ర‌కు.. మాట్లాడిన చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తో ఇంత ఓట‌మి ఎదురు కాలేద‌ని.. వేర్వేరు కార‌ణాలే ప‌రాజ‌యానికి కార‌ణంగా ఆయ‌న చెప్ప‌టం క‌నిపిస్తుంది.

టీడీపీ స‌ర్కారు చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేద‌ని.. గ‌తంలో పార్టీపై వ్య‌తిరేక‌త క‌నిపించినా.. ప్ర‌స్తుతం అది కూడా లేద‌న్నారు. సామాజిక స‌మీక‌ర‌ణాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఎన్నిక‌ల వ్యూహం ప్ర‌భావం క‌నిపించింద‌న్న వాద‌న‌ను వినిపించారు.

టీడీపీ నేత‌లపై అవినీతి ముద్ర వేసేందుకు టెండ‌ర్ల అంశాన్ని తెర మీద‌కు తెచ్చార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు తీరు చూస్తే.. ఇంత జ‌రిగిన త‌ర్వాత ఓట‌మిపై నిజాన్ని గుర్తించ‌లేని చంద్ర‌బాబు తీరు ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌క‌మాన‌దు. ఇలా అయితే.. బాబు ఎప్ప‌టికి నిజం తెలుసుకునేట‌ట్లు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English