న‌న్ను గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించ‌లేదు..సుష్మా క్లారిటీ

న‌న్ను గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించ‌లేదు..సుష్మా క్లారిటీ

రోజంతా హోరెత్తిన ప్ర‌చారానికి తెర‌ప‌డింది. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం విష‌యంలో చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నియమించబోతున్నట్టు సాగిన ప్ర‌చారానికి శుభం కార్డు ప‌డింది. అస‌లు అలాంటి చాన్సే లేద‌ని, త‌న‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించ‌లేద‌ని...సాక్షాత్తు సుష్మాస్వ‌రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్లో ఆమె వ‌రుస‌గా రెండు పోస్టుల ద్వారా స్ప‌ష్టం చేసేశారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ పోటీ చేయలేదు. ఆమెతోపాటు మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా బరిలోకి దిగలేదు. వీరిద్దరినీ గవర్నర్లుగా పంపిస్తారని జాతీయ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ ప్ర‌చారాన్ని కొంద‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు లింక్ పెట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొత్త గవర్నర్‌ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం.. ఆ పదవికి సుష్మాస్వరాజ్‌ను ఎంపిక చేయబోతున్నట్టు బీజేపీ వర్గాల ద్వారా సమాచారం అందిందని కథనాలు కనిపించాయి. ఇవన్నీ ఊహాగానాలే అనుకుంటున్న సమయంలో.. 'ఏపీ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు శుభాకాంక్షలు' అంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశారు. ఐతే.. కొద్దిసేపటికే ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో.. ఏపీ గవర్నర్‌గా సుష్మ నియమితులయ్యారా లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.

పెద్ద ఎత్తున వార్త‌లు వైర‌ల్ అయిన నేప‌థ్యంలో...నేరుగా సుష్మాస్వ‌రాజ్ వివ‌ర‌ణ ఇచ్చారు. `నేను ఉప‌రాష్ట్రప‌తి ఆఫీసుకు ఫోన్ చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియామకం  గురించి అడిగి తెలుసుకున్నారు. నన్ను ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించ‌లేదు. ఈ విష‌యంలో ఈ వివ‌ర‌ణ స‌రిపోతుంద‌ని నేను భావిస్తున్నాను`` అని సుష్మ ట్వీట్లో చెప్పేశారు. ఇక‌నైన ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డుతుందేమో వేచి చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English