ఫస్ట్ బేటీలనే జగన్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారే

ఫస్ట్ బేటీలనే జగన్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారే

వైసీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన కేబినెట్ సహచరులతో తొలి భేటీ నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ భేటీలో చాలా అంశాలే ప్రస్తావనకు వచ్చాయి. తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు వినిపించిన ఈ భేటీ, ఆర్టీసీ కార్మికులకు కూడా గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇవన్నీ బాగానే ఉన్నా... తొలి కేబినెట్ భేటీలోనూ కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ నేతలకు షాక్ తగిలిందని చెప్పాలి.

కేబినెట్ భేటీలో జగన్ చేసిన వ్యాఖ్యలతో మంత్రలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారిందరికీ పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. అవినీతి రహిత పాలన అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న జగన్... తన పాలనలో అవినీతికి తావు లేకుండా వ్యవహరించాలని మంత్రులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో పలు వ్యాఖ్యలు చేసిన జగన్... అవినీతిని దరి చేరనీయని మంత్రులను పదవుల్లో నుంచి తొలగించేందుకు తాను ఏమాత్రం వెనుకాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ శాఖలో అవినీతి జరిగినా... సంబంధిత శాఖ వ్యవహారాలు చూస్తున్న మంత్రే బాధ్యత వహించాలని జగన్ తేల్చేశారు. బంధువులు, స్నేహితులు మంత్రుల పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడకుేండా చూసుకోవాలని ఆయన తన సహచర మంత్రులకు షాకిచ్చారు.

అవినీతి అనేది ఎక్కడ జరిగినా కూడా ఎంతమాత్రం సహించేది లేదని తేల్చి పారేశారు. అవినీతికి పాల్పడితే... తన కేబినెట్ లో కొనసాగడం కష్టమేనని కూడా జగన్ ఇండైరెక్ట్ గా వార్నింగులు జారీ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తిొలి భేటీలోనే అవినీతి రహిత పాలన దిశగా సాగాలని పిలుపు ఇవ్వడం వరకు ఓకే గానీ... ఏకంగా అవినీతికి పాల్పడితే... మంత్రి పదవులను నుంచి తొలగించేందుకు వెనుకాడనని జగన్ తమ ముఖం మీదే చెప్పడంతో మంత్రులంతా కాస్తంత ఇబ్బందిగానే ఫీలయ్యారని చెప్పాలి. తొలి భేటీలోనే ఇలా ఉంటే... ఇక తర్వాతి పరిస్థితి ఏమిటని మంత్రులు గుసగులాడుకోవడం అప్పుడే మొదలైపోయింది. మరి ఈ తరహా వార్నింగులు జగన్ కు ఉపకరిస్తారో, వికటిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English