వాట్సాప్ మెసేజ్ దెబ్బకు ఏపీ మంత్రులకు ఫోన్ల తాకిడి

 వాట్సాప్ మెసేజ్ దెబ్బకు ఏపీ మంత్రులకు ఫోన్ల తాకిడి

జగన్ కేబినెట్లోని 25 మంది మంత్రులకు ఆదిలోనే అనుకోని సమస్య వచ్చి పడింది. మంత్రివర్గంలోని చాలామంది నాయకులు కొత్తవారు కావడం.. రాష్ట్రస్థాయిలో పేరున్నవారు కాకపోవడంతో వారికి ఇంతవరకు తమ పార్టీ, నియోజకవర్గ నేతలు, పరిచయస్థుల నుంచి తప్ప ఇతరత్రా కాల్స్, సందేశాలు వచ్చేవి కావు. కానీ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అందరి ఫోన్ నంబర్లూ కలిపి వాట్సా‌ప్‌లో ప్రచారం కావడంతో సమస్య వచ్చిపడింది. వరుస పెట్టి కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాలు వచ్చి పడుతుండడంతో తెగ ఇబ్బంది పడుతున్నారట.

మంత్రుల్లో చాలామంది‌కి ఫేస్ బుక్ ఖాతాల్లోని నంబర్లు, వారు నిత్యం ఉపయోగించే అసలు నంబర్లు ఒకటే. అలాగే.. ట్రూకాలర్‌లో నమోదైన నంబర్, మంత్రుల అసలు నంబర్లు కూడా ఒకటే కావడంతో మంత్రులు పేర్లు ప్రకటించగానే కొందరు వారి నంబర్లు సేకరించి సోషల్ మీడియా, వాట్సాప్‌లో వ్యాప్తిలోకి తెచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికీ వీరందరి నంబర్లు చేరిపోయాయి.

తమకే మాత్రం పరిచయం లేనివారు కూడా ఫోన్లు చేసి అభినందించడం, సలహాలు ఇవ్వడం, సమస్యలు చెబుతుండడంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు. ఫోన్‌ మోత భరించలేక కొందరు అమాత్యులు స్వీచ్చాఫ్‌ చేసేశారట. ప్రమాణస్వీకారం చేసి తొలి కేబినెట్‌ సమావేశానికి హాజరైన సమయంలోనూ వారికి ఇబ్బందులు తప్పలేదు. దీంతో చాలామంది మంత్రులు ఆ నంబర్లు వెంటనే మార్చేయాలని నిర్ణయించుకున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English