టాంపరింగ్ వివాదం.. స్పందించిన ఆసీస్ కెప్టెన్

టాంపరింగ్ వివాదం.. స్పందించిన ఆసీస్ కెప్టెన్

ఇంగ్లండ్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డేలో బాల్ టాంపరింగ్ జరిగిందా..? ఆసీస్ బౌలర్ తన ప్యాంటు జేబులో పదే పదే చేతులు ఎందుకు పెట్టాడు..? అతడు బంతికి ఏదో పదార్ధాన్ని రుద్దుతున్నట్లు కనిపించింది నిజమేనా..? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ ప్రేమికులు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వ్యవహారం కలకలం రేపింది. ఆసీస్‌ జట్టుకు చెందిన స్పిన్నర్ ఆడమ్ జంపా బంతి షేప్‌ను మార్చే ప్రయత్నం చేశాడంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీన్ని చూసిన వారందరూ ఆసీస్ బౌలర్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ అతడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

 ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంటే ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండో బంతి వేస్తున్నప్పుడు ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా.. తన ప్యాంటు జేబులోంచి ఏదో తీసి బంతికి రుద్దాడు. ఈ ఒక్క సందర్భంలోనే కాదు.. అతడు బౌలింగ్ చేయడానికి వచ్చిన ప్రతిసారీ అతడు ఇదే తరహాలో వ్యవహరించాడు. దీంతో జంపా టాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. అంతేకాదు, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీసీకి విన్నవిస్తున్నారు.

 దీనిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించాడు. ‘‘బాల్ టాంపరింగ్ వ్యవహారం మా వరకు చేరింది. అయితే, ఆడమ్ జంపా బంతి షేప్‌ను మార్చుతున్నట్లు చెబుతున్న ఫొటోలను నేను గానీ, మా జట్టు మేనేజ్‌మెంట్ గానీ చూడలేదు. అతడు ఏం చేశాడన్నది పక్కనబెడితే.. ఒకటి మాత్రం చెప్పగలను. జంపా ప్రతి మ్యాచ్‌లోనూ తన జేబులో హ్యాండ్‌ వార్మర్‌ని ఉంచుకుంటాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేమ కారణంగా బంతిపై పట్టుచిక్కకపోతే దాన్ని వినియోగిస్తాడు. బహుశా.. భారత్‌పై మ్యాచ్‌లోనూ హ్యాండ్‌ వార్మర్‌‌ని అతను వాడి ఉంటాడు. ఇంతకంటే ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English