గ‌వ‌ర్న‌ర్ సాబ్ కు రెన్యువ‌ల్ లేద‌ట‌!

గ‌వ‌ర్న‌ర్ సాబ్ కు రెన్యువ‌ల్ లేద‌ట‌!

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ స‌ర్కారులో నియ‌మితులైన గ‌వ‌ర్న‌ర్ మోడీ ప్ర‌భుత్వం కొన‌సాగే అవ‌కాశం ఉందా? అంటే.. లేదంటే లేద‌ని చెప్పేస్తారు. కానీ..దానికో మిన‌హాయింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రూటు స‌ప‌రేటు. ఆయ‌న మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు.  విధేయుడిగా చెబుతారు. అలాంటి ఆయ‌న్ను న‌మ్మి మ‌రీ ఉమ్మ‌డి ఏపీకి పంపారు.

త‌ర్వాతి కాలంలో యూపీఏ స‌ర్కారు పోయి.. ఎన్డీయే స‌ర్కారు వ‌చ్చింది. యూపీఏ హ‌యాంలో నియ‌మించిన ఎంతో మంది గ‌వ‌ర్న‌ర్ల‌ను ఇంటికి పంపిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు మోడీ. ఒక్క న‌ర‌సింహ‌ణ్ తో పాటు.. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌ల‌ను మార్చ‌లేదు. కాకుంటే ట‌ర్మ్ ముగిసిన వెంట‌నే షేక్ హ్యాండ్ ఇచ్చేసి రోశ‌య్య‌ను ఇంటికి పంపారు.కానీ.. అందుకు భిన్నంగా న‌ర‌సింహ‌న‌న్ మాత్రం కంటిన్యూ చేశారు.

ఒక‌ప్పుడు సీబీఐ బాస్ గా పని చేసి ఉండ‌టం.. ప్ర‌ధాని మోడీతో న‌ర‌సింహ‌న్ కు ఉన్న ప‌రిచ‌యం కూడా ఆయ‌న ప‌ద‌వి కంటిన్యూ కావ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. యూపీఏ హ‌యాంలో ఎంట్రీ ఇచ్చిన న‌ర‌సింహ‌న్ దాదాపుగా ప‌దేళ్ల నుంచి హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్స‌న్ ఎవ‌రంటే ఇద్ద‌రుముఖ్య‌మంత్రులు ఎంత మాత్రం కాదని చెప్పాలి. వారి కంటే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎవ‌రి వ‌ద్ద ఎలా ఉండాలో ఆయ‌న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌ని చెబుతారు. ఈ కార‌ణంతోనే ముఖ్య‌మంత్రులు వ‌రుస పెట్టి మారుతున్నా.. గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ మాత్రం మార‌క‌పోవ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. న‌రసింహ‌న్ ట‌ర్మ ఈ డిసెంబ‌రు నాటికి పూర్తి అవుతుంద‌ని.. ఈసారికి మాత్రం రెన్యువ‌ల్ లేకుండా ఉండొచ్చ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అవ‌స‌ర‌మైతే వేరే రాష్ట్రానికి పంప‌ట‌మో .. ఇంకేదైనానిర్ణ‌యం తీసుకోవ‌టం చేస్తార‌ని.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు బీజేపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే ఈసారి గ‌వ‌ర్న‌ర్ పోస్టు ద‌క్కుతుందంటున్నారు. మ‌రి.. అదే జ‌రిగితే త‌మ ఆలోచ‌న‌ల్ని.. వాద‌న‌ల్ని గ‌వ‌ర్న‌ర్ సాబ్ ద్వారా ప్ర‌ధానికి పంపుతున్న ఇద్ద‌రు తెలుగు సీఎంల ప‌రిస్థితి ఏంది? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English