విన‌య విదేయ జ‌గ‌న్‌

విన‌య విదేయ జ‌గ‌న్‌

`విన‌య విదేయ జ‌గ‌న్‌` ఈ పేరును ఇప్పుడు నెటిజ‌న్లు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ఖాయం చేసేశారు. ఎన్నిక‌ల్లో అఖండ మెజార్టీతో విజ‌యం సాధించి సీఎం పీఠం కైవ‌సం చేసుకున్న జ‌గ‌న్‌...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తొలిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఈ పేరును పెట్టారు. ఒక‌టి కాదు రెండు సార్లు...ప్ర‌ధాని మోదీకి జ‌గ‌న్ పాదాభివందనం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలోనే గ‌వ‌ర్న‌ర్ త‌ర్వాత స్వాగ‌తం ప‌లికిన జ‌గ‌న్ ఆయ‌న‌కు పాదాభివందనం చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, దానిని ప్ర‌ధాని మోదీ వారించారు. అనంత‌రం ప్ర‌ధాని మోదీ, జ‌గ‌న్ ప‌రిచ‌య కార్య‌క్ర‌మ పూర్త‌వ‌గా..జ‌గ‌న్ మ‌ళ్లీ  పాదాభివంద‌నం చేసేందుకు ఉద్యుక్తుల‌య్యారు. అయితే, దీనిని ప్ర‌ధాని మ‌ళ్లీ వారించారు. అనంత‌రం జ‌గ‌న్ త‌న పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, పార్టీ నేత‌ల‌ను ప్ర‌ధానికి ప‌రిచ‌యం చేశారు.

కాగా, శ్రీలంక పర్యటన ఎక్కువ సేపు కొనసాగడంతో తిరుపతికి రావడం ఆలస్యమైందని.. పబ్లిక్ మీటింగ్ ఆలస్యమైనందుకు ఏపీ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పారు. తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్.. ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు.  ఆంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ తోడుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ``ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు.. ప్రజల మనసును కూడా గెలవాలి. దాని కోసం 365 రోజులు పార్టీ శ్రేణులు పనిచేయాలి. రెండోసారి విజయం సాధించాక స్వామి వారి ఆశీర్వాదం తీసుకుందామని తిరుపతికి వచ్చాను. తిరుపతికి ఇదివరకు చాలా సార్లు వచ్చాను. మళ్లీ అధికారంలోకి వచ్చాక తిరుపతికి రావడం చాలా సంతోషంగా ఉంది``.. అని మోదీ తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English