నాదెండ్ల మ‌నోహ‌ర్..జ‌న‌సేన‌లో ఉన్న‌ట్లే అనుకోవాలట‌!

నాదెండ్ల మ‌నోహ‌ర్..జ‌న‌సేన‌లో ఉన్న‌ట్లే అనుకోవాలట‌!

`జ‌న‌సేన పార్టీకి చెందిన నేత‌, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ గుడ్‌బై` ఉద‌యం నుంచి హోరెత్తిన ప్ర‌చారం...జోరుగా సాగిన ఊహాగానాలు...అందుకు బ‌లం చేకూర్చే ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ...అవ‌న్నీ నిజం కాద‌ని అంటూ ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అయితే, స‌ద‌రు నేత మాత్రం అదేమీ లేదంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే, మీడియా ముందుకు రాకుండా ఆయ‌న విడుద‌ల చేసిన ఈ ప్ర‌క‌ట‌న స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్  సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆయ‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవ‌లి ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో జ‌నసేనాని పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశానికి నాదెండ్ల మనోహర్ హాజరుకాకపోవడంతో..ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఉద‌యం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున  వైర‌ల్ అవ‌గా...సాయంత్రం ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.

మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన మ‌నోహ‌ర్ తాను జనసేన పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను పార్టీ వీడుతానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. విదేశాల్లో ఉండటం వల్ల పార్టీ సమీక్షల్లో పాల్గొనలేకపోయానని.. వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా నాదెండ్ల మనోహర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని జనసేన పార్టీ పేర్కొంది. మొత్తంగా  నాదెండ్ల మనోహర్ ఎపిసోడ్ జ‌న‌సేన‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English