రోజాకు జ‌గ‌న్ కొత్త ప‌ద‌వి...అయినా స‌మ‌స్యే

రోజాకు జ‌గ‌న్ కొత్త ప‌ద‌వి...అయినా స‌మ‌స్యే

ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం కీల‌క ప‌రిణామాలు సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం సంద‌డి కొనసాగుతుండ‌గానే...మరోవైపు వైసీపీ నేత‌ల అసంతృప్తి క‌నిపించింది. ఈ ప్ర‌మాణ స్వీకారంలో ముగ్గురు నలుగురు వైఎస్సార్సీపీ కీలక ఎమ్మెల్యేలు కనిపించలేదు. అందులో రోజా ఒకరు. శుక్రవారం సాయంత్రమే ఆమె అమరావతి నుంచి వెళ్లిపోయినట్లు కొందరు నేతలు చర్చించుకోవడం కనిపించింది. మంత్రి పదవి దక్కకపోవడంతోనే రోజా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే, రోజా అసంతృఫ్తిని గ‌మ‌నించిన వైసీపీ అధిష్టానం ఆమెకు మ‌రో ప‌ద‌విని ప్ర‌తిపాదిస్తారు.

రోజాకు జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని మొదటి నుంచి ఆమె అనుచరులు కూడా బలంగా నమ్మారు. కానీ.. కేబినెట్ లిస్టులో పేరు కనిపించలేదు. శుక్రవారం జరిగిన వైఎస్సార్ఎల్పీ  సమావేశానికి వచ్చిన రోజా.. మీడియాతోనూ మాట్లాడారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. సామాజిక వర్గాల ప్రాధాన్యతల వల్లే రోజాకు కేబినెట్లో చోటు దక్కలేదని తెలుస్తోంది. కేబినెట్‌లో తనకు స్థానం దక్కపోవడంపై రోజా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. స్వయంగా సీఎం వైఎస్ జగన్‌ ఆమెకు ఫోన్ చేసి.. విజయవాడలో అందుబాటులో ఉండాలని చెప్పినా.. ఆమె వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తొమ్మిదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న రోజాకు మంచి పదవే దక్కుతుందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రోజాను నియమించే అవకాశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నారని సమాచారం.

అయితే, రోజా నియామాకిని రోజా పేరును ప్ర‌తిపాదిస్తున్న‌ప్ప‌టికీ ప‌లు స‌మ‌స్య‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నారు. సాధారణంగా మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవి చేపట్టే వారు పార్టీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉన్న వారిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించ వచ్చా? లేదా? అనేదానిపై ఏపీ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో రోజాకు ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నప్ప‌టికీ రోజా అసంతృప్తి నేప‌థ్యంలో . అప్పటి వరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి రోజాకు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.లీగల్ చిక్కులు లేకుంటే కొన్ని రోజుల వ్యవధిలోనే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి దక్కవ‌చ్చంటున్నారు. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌తకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English