పవన్‌ ఫాన్స్‌ సంబరాలు

పవన్‌ ఫాన్స్‌ సంబరాలు

పవన్‌కళ్యాణ్‌ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. అభిమానులని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడనే పుకార్లకి శాశ్వతంగా చెక్‌ పెట్టాడు. తన శవం నలుగురు మోసే వరకు రాజకీయాల్లోనే వుంటానని, జనసేనని నడిపిస్తానని మరోమారు ఉటంకించాడు. గెలిచిన వాడు గెలిచిన సంబరంలో ఎన్నయినా చెబుతాడని, ఓడిన వాడు అక్కడే నిలబడి పోరాడితేనే అతనేమిటనేది తెలుస్తుందని, ఓటమి తనకి కొత్త కాదని, ఎన్నోసార్లు పడిపోయినా మళ్లీ లేచానని గుర్తు చేసాడు. తనని ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టారనే సంగతి తనకి తెలిసిందన్నాడు.

ఇక ప్రజాసేవకే అంకితమయి వుంటానని, పడిన చోటే లేచి చూపిస్తానని ఫాన్స్‌కి మాట ఇచ్చాడు. ఫలితాల తర్వాత రెండు వారాల సమయం తీసుకున్నా కానీ మునుపటి ఆవేశం అలాగే చూపిస్తూ పోరాటం కొనసాగిస్తానని పవన్‌ చెప్పడంతో ఫాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. ఓటమి తర్వాత ఎక్కడ తిరిగి సినిమాలు మొదలు పెడతాడో అనే చాలా మంది భయపడ్డారు. ప్రజారాజ్యం ఓటమి తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసినపుడు ఫాన్స్‌ బాగా హర్టయ్యారు.

పవన్‌ కూడా అలాగే చేస్తాడేమోననే భయాలు తొలగిపోవడంతో, ఇక రాజకీయాలకే పవన్‌ అంకితమైపోవడంతో, ఇకనుంచి ఫాన్సే కాకుండా ప్రజలు కూడా తనని సీరియస్‌గా తీసుకుంటారని, వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ రాజకీయ శక్తిగా ఎదుగుతాడని అభిమానులు పులకించిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English