అలాంటి సినిమాకు ఇలాంటి హీరోనా?

అలాంటి సినిమాకు ఇలాంటి హీరోనా?

త‌మిళంలో కొన్నేళ్ల కింద‌ట సూప‌ర్ హిట్ అయిన అజిత్ సినిమా 'వీరం' ను తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా 'కాట‌మ‌రాయుడు' పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అది ఊర మాస్ స్ట‌యిల్లో సాగే రూర‌ల్ యాక్ష‌న్ సినిమా. త‌మిళంలో ఏదో అలా ఆడేసింది కానీ.. తెలుగులో ఈ రొటీన్ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు. ప‌వ‌న్‌కు తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమా అత‌డికి సెట్ట‌వ్వ‌లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మయ్యాయి.

ఐతే ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్తోంద‌ట‌. అక్క‌డ ఇలాంటి రూర‌ల్ డ్రామాలు ఆడ‌తాయా అన్నది సందేహం. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌డ‌మే ఆశ్చ‌ర్య‌మంటే అందులో ఎలాంటి మాస్ ఇమేజ్ లేని విక్కీ కౌశ‌ల్‌ను హీరోగా పెడుతున్నార‌న్న స‌మాచారం షాకిస్తోంది.

ఈ ఏడాది ఆరంభంలో విక్కీ 'యురి' సినిమాతో ఆక‌ట్టుకున్నాడు. అది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో సాగిన సినిమా. అందులో క‌థే ప్ర‌ధానం. హీరో ఇమేజ్‌తో సంబంధం లేదు. న‌టుడిగా విక్కీకి మంచి పేరుంది. అత‌ను ఇప్ప‌టిదాకా ఎక్కువ‌గా క్యారెక్ట‌ర్ రోల్సే చేస్తూ వ‌చ్చాడు. 'యురి'తో కొంత ఫాలోయింగ్ వ‌చ్చింది. కానీ పెద్ద మాస్ హీరో చేయాల్సిన 'వీరం' లాంటి క‌థ‌కు అత‌నెలా సూట‌వుతాడ‌న్న‌ది అర్థం కాని విష‌యం. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం 'వీరం' హ‌క్కులు కొన్న సాజిద్ న‌డియాడ్వాలా.. విక్కీనే హీరోగా ఎంచుకున్నాడ‌ని రిపోర్ట్ చేస్తోంది.

ఇదే నిజ‌మైతే మాత్రం.. అత‌డిని హీరోగా పెట్టి ఉన్న‌దున్న‌ట్లు ఈ సినిమా తీస్తే బోల్తా కొట్ట‌డం ఖాయం. సౌత్ నుంచి రీమేక్ చేసే ప్ర‌తి సినిమానూ హిందీ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లు మారుస్తారు కానీ.. ఎంత మార్చినా కూడా ఈ సినిమా హిందీలో సెట్ అవుతుందా.. అస‌లు ఈ క‌థ‌కువిక్కీ ఏమాత్రం సూట్ అవుతాడు అన్న‌ది సందేహ‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English