బాబుపై ప‌గ‌తో కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకున్న జ‌గ‌న్‌!

బాబుపై ప‌గ‌తో కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకున్న జ‌గ‌న్‌!

రాజ‌కీయాల్లో విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు త‌ప్పేమి కాదు. కానీ అధికారంలో ఉన్నాం క‌దా అని...శ‌త్రుత్వంతో నిర్ణ‌యాలు తీసుకుంటే..అది చెడు పోక‌డ‌ల‌కు దారితీస్తుంది. ముందు తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మీక్షించ‌డంలో అయినా...కొత్త నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డంలో అయినా  ఇలాంటి దోర‌ణి ఆహ్వానించ‌ద‌గ్గ‌దేం కాదు. స‌రిగ్గా ఇదే విష‌యంలో...ఏపీ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ జ‌గ‌న్‌కు ఊహించని ఎదురుదెబ్బ త‌గిలింది. సాక్షాత్తు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆయ‌న మొట్టికాయ‌లు వేయించుకోవాల్సి వ‌చ్చింది. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌ట్ల శ‌త్రుత్వం వ‌ల్ల సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలోనే జ‌గ‌న్‌కు కేంద్రం క్లాస్ తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ ఘాటుగా రియాక్ట‌వ‌డం గురించే ఈ చ‌ర్చంతా.

ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు స్వీక‌రించింది మొద‌లు చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను స‌మీక్షించ‌డం, మార్చ‌డం, ఉప‌సంహ‌రించ‌డం అనే కార్య‌క్ర‌మంలో వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఆయ‌న చంద్ర‌బాబు సీఎంగా ఉన్న హ‌యాంలోని  విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని ప్రక‌టించారు. అయితే, దీనిపై కేంద్రం స్పందించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే అవకాశం ఉందని స్ప‌ష్టం చేసింది. ఒప్పందాల్లో ఏదైనా కుట్ర జరగడం లేదా మితిమీరిన లబ్ధి చేకూరిందని రుజువైతే తప్ప ఒప్పందాలను పున:పరిశీలన చేయరాదని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంకు ఈ మేర‌కు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనందకుమార్ లేఖ రాశారు. మితిమీరిన ల‌బ్ధి చేకూరింద‌ని రుజువు  కానీ పక్షంలో గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. అదికూడా బహిరంగ వేళం ప్రక్రియలో సాగుతాయని గుర్తుచేసింది. 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాధక శక్తి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఇందన శాఖ గుర్తు చేసింది. ఇలాంటి సమయంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పున:పరిశీలన జరపడం సరికాదని స్పష్టం చేసింది. వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్‌కు వివరించాలని సుబ్రహ్మణ్యానికి ఇంధనశాఖ సూచించడం కొస‌మెరుపు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English