తెలుగు రాజకీయాల్లో తొలి మహిళా ఉపముఖ్యమంత్రి శ్రీవాణి

తెలుగు రాజకీయాల్లో తొలి మహిళా ఉపముఖ్యమంత్రి శ్రీవాణి

పాతిక మందితో కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహనరెడ్డి ఏకంగా అయిదుగురికి ఉపముఖ్యమంత్రి హోదా ఇవ్వాలనుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ అయిదుగురు ఉపముఖ్యమంత్రులు ఎవరెవరో ప్రకటించారు.

పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, నారాయణస్వామి, అంజాద్ బాషాలు ఉపముఖ్యమంత్రులుగా సీఎం జగన్ కు పరిపాలనలో సహకారం అందించనున్నారు. డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ జగన్ వివిధ సామాజికవర్గాలకు చోటు కల్పించారు.

ఉప ముఖ్యమంత్రుల్లో పుష్ప శ్రీవాణి ఎస్టీ కాగా.. సుభాష్ చంద్రబోస్ శెట్టి బలిజ(బీసీ) వర్గానికిచెందినవారు. ఆళ్ల నాని కాపు, నారాయణ స్వామి ఎస్సీ, అంజాద్ భాషా ముస్లిం మైనారిటీ.

కాగా పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రి చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ, నవ్యాంధ్రల్లో కానీ ఏ మహిళకూ ఇంత పెద్ద పదవి దొరకలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలు కేంద్ర మంత్రులు, శాసనసభ స్సీకర్, మంత్రులు వంటి పదవులు చేపట్టారే కానీ ఎవరూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. ఇప్పుడు జగన్ నిర్ణయంతో పుష్ప శ్రీవాణి తెలుగు నేలన తొలి ఉప ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English