డిప్రెషన్‌లో పవన్‌ కళ్యాణ్‌!

డిప్రెషన్‌లో పవన్‌ కళ్యాణ్‌!

ఓటమిని తట్టుకుని ఇకపై కూడా రాజకీయాలలోనే కొనసాగాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకోవడంతో అభిమానులు ఆనందంగా వున్నారు. అయితే ఓటమి భారాన్ని మాత్రం పవన్‌ దాచలేకపోతున్నాడు. మునుపెన్నడూ లేనంతగా పవన్‌ గ్లామర్‌ మొత్తం కోల్పోయాడు. జుట్టు, గడ్డం అతిగా పెంచడం మాట ఎలా వున్నా ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా లేడనేది చూస్తేనే తెలిసిపోతోంది. విపరీతంగా పెరిగిన బుగ్గలు, తన్నుకొస్తోన్న పొట్ట... ఈ రూపంలో పవన్‌ని అభిమానులు చూడలేకపోతున్నారు.

ఇలా కనిపించడం వల్ల అవతలి పార్టీల వాళ్లు మరింతగా అపహాస్యం చేయడానికి ఆస్కారం ఇస్తున్నాడని, పవన్‌ కాస్త ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి, గ్లామర్‌ కాపాడుకోవాలని ఫాన్స్‌ కోరుతున్నారు. పొలిటికల్‌ ఫీల్డ్‌లో వున్నంత మాత్రాన గ్లామర్‌ని నిర్లక్ష్యం చేయాల్సిన పని లేదని, పార్టీకి ఎప్పటికీ పవన్‌ గ్లామరే ప్రధాన ఆకర్షణ అవుతుందని, డీలా పడిన వాడిలా కనిపించకుండా, హుషారుగా వుంటే అందరిలోను ఉత్సాహం తిరిగి వస్తుందని వారు సోషల్‌ మీడియా ద్వారా సూచిస్తున్నారు. అయితే పవన్‌ ఇలాంటివన్నీ వింటున్నాడా లేదా అనేది మాత్రం తెలియదు. తన ధోరణిలో తాను వుండే పవన్‌ అసలు తదుపరి కార్యాచరణ ఏమిటనేది కూడా పార్టీ శ్రేణులకే అంతు చిక్కడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English