అడిగి లేద‌నిపించుకోవ‌డం ఎందుకు బాబు?

అడిగి లేద‌నిపించుకోవ‌డం ఎందుకు బాబు?

ఒక్కోసారి...ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపిస్తుంటుంది. దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా గుర్తింపు పొంద‌డ‌తో పాటుగా రాజ‌కీయాల్లో అనేక సంక్షోభాల‌ను విజ‌యవంతంగా ఎదుర్కున్న‌ నాయ‌కుడిగా చంద్ర‌బాబు గుర్తింపు పొందారు. తాజాగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో ప‌రాజయం పాలైన త‌ర్వాత ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన వైసీపీని ఓ కోరిక కోర‌డం...దానికి వైసీపీ స్పందించిన తీరు ఈ భావ‌న క‌లిగేందుకు కార‌ణం.

వివ‌రాల్లోకి వెళితే...ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదిక‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు, పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యేందుకు ఈ వేదిక‌ను నిర్మించారు. అయితే, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి పాల‌వ‌డం, వైసీపీని గెలుపొందడం తెలిసిన సంగ‌తి తెలిసిందే. అయితే, వైసీపీ గెలుపు అనంత‌రం ముఖ్య‌మంత్రి హోదాలో నిర్మించిన ప్రజావేదిక‌ను సీఎం చంద్ర‌బాబు ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. దీంతో, పార్టీ కార్య‌క‌లాపాల కోసం త‌న‌కు ఆ ప్రాంగ‌ణాన్ని కేటాయించాల‌ని సీఎం  జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ రాశారు. దీనికి చిత్రంగా జ‌గ‌న్ బ‌దులుగా విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.

తెలుగుదేశం పార్టీ అన్నా...టీడీపీ నేత‌ల‌న్నా...పూచిక పుల్ల‌తో స‌మానంగా చూసే విజ‌య‌సాయిరెడ్డి తాజాగా చంద్ర‌బాబు కోరిక విష‌యంలోనూ అదే రీతిలో రియాక్ట‌య్యారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు సైతం ఉండ‌వ‌ల్లి ప్రాంగ‌ణాన్ని త‌మ‌కు కేటాయించాల‌ని కోర‌డంపై స్పందిస్తూ...`అవ‌కాశం ఉంటే చంద్ర‌బాబు కోసం పోల‌వ‌రం ప్రాజెక్టు, లోకేష్ కోసం ప్ర‌కాశం బ్యారేజీని సైతం అడుగుతారు`` అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎపిసోడ్‌ను గ‌మ‌నించిన ప‌లువురు....అడిగి లేద‌నిపించుకోవ‌డం ఎందుకు బాబు అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English