ఈవెనింగ్ దాకా టెన్ష‌నే!.... సాయిరెడ్డి కాల్స్ ఎవ‌రికో?

ఈవెనింగ్ దాకా టెన్ష‌నే!.... సాయిరెడ్డి కాల్స్ ఎవ‌రికో?

వైసీపీ అధినేత‌, ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు నిజంగానే టెన్ష‌న్ పెట్టేశార‌ని చెప్పాలి. నేటి ఉద‌యం తాడేప‌ల్లి లోని పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో మంత్రివ‌ర్గానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించారు. కేబినెట్ లో మొత్తం 25 మందికి అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... అందులో ఐదుగురికి డిప్యూటీ సీఎం ప‌ద‌వులు కేటాయిస్తాన‌ని చెప్పారు. ఆ ప‌ద‌వులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామిజిక వ‌ర్గాల‌కు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక కేబినెట్ లో 50 శాతం ప‌దవులు రిజ‌ర్వ్‌డ్ కేటగిరీకేన‌ని చెప్పిన జ‌గ‌న్‌... అస‌లు మంత్రి ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి ఇస్తున్నాన‌న్న విష‌యాన్ని మాత్రం వెల్లడించ‌లేదు. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నా... ఆ జాబితాను మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. ఈ జాబితాలో ఉన్న వారికి సాయంత్రానికి ఫోన్ వ‌స్తుంద‌ని, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత వేణుంబాక విజ‌యసాయిరెడ్డి ఫోన్ చేస్తార‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలంతా త‌మ ఫోన్ల రింగ్ టోన్ల సౌండ్ ను అమాంతం పెంచేసి పెట్టేసుకున్నారు. ఇప్పుడు త‌మ ఫోన్లు రింగైతే చాలు ముందూ వెనుకా చూడ‌కుండా ఎత్తేసేందుకు సిద్ధ‌మైపోయారు.

అంటే మొత్తంగా వైసీపీ ఎమ్మెల్యేలంతా టెన్ష‌న్ లోనే ప‌డిపోయార‌న్న మాట‌. త‌మ‌లో ఎవ‌రికి ఫోన్ వ‌స్తుంద‌న్న ఆస‌క్తితో పాటు త‌మ‌కు సాయిరెడ్డి నుంచి ఫోన్ వ‌స్తుందా?  రాదా? అన్న కోణంలో వైసీపీ ఎమ్మెల్యేలంతా టెన్ష‌న్ లో ప‌డిపోయారు. సాయంత్రం దాకా ఒక్క క్ష‌ణం కూడా ఫోన్ ప‌క్క‌న‌పెట్టేయ‌డానికి ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా సిద్ధంగా లేర‌నే చెప్పాలి. సాయంత్రానికి టెన్ష‌న్ మొత్తం తీరిపోనుండ‌గా... మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని వారు మాత్రం రెండున్న‌రేళ్ల దాకా వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇక మంత్రి ప‌ద‌వి మీకేనంటూ ఫోన్ వ‌చ్చినా... ఎస్సీ, ఎస్టీ, బీసీ,. మైనారిటీ, కాపు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు తమకు డిప్యూసీ సీఎం ప‌ద‌వి ద‌క్కుతుందా? ద‌క్క‌నా? అన్న టెన్ష‌న్ ను రేప‌టి దాకా కొన‌సాగించ‌క త‌ప్ప‌ద‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English