కేసీఆర్ ఆపరేషన్ క్లైమాక్స్ కి చేరింది

కేసీఆర్ ఆపరేషన్ క్లైమాక్స్ కి చేరింది

తెలంగాణ కాంగ్రెస్‌కు షాకుల ప‌రంప‌ర కొనసాగ‌డానికి బ్రేకులు ప‌డ‌గా...స్వ‌ల్ప విరామం అనంత‌రం మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది. ఇప్ప‌టికే ప‌రిష‌త్ పోరులో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్‌కు కొంద‌రు ఎమ్మెల్యేలు పార్టీ వీడ‌టం ఖాయ‌మనే వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఇప్ప‌టికే ప‌దకొండు మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌భై చెప్ప‌గా మ‌రికొంద‌రు ఆ జాబితాలో ఉన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బె చెప్పబోతున్నారు. ఇంకో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

తెలంగాణ‌లో ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం ఇండిపెండెంట్లుగా గెలిచిన కోరుకంటి చందర్, రాములునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య గులాబీ పార్టీలో చేరనున్న‌ట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ప‌దకొండు మంది టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు వెల్ల‌డించారు. ఈ చేరిక‌తో ఎమ్మెల్యేల సంఖ్య వంద‌కు చేరింది. ఈ షాకుల ప‌రంప‌ర‌ను మ‌రింత కొన‌సాగించ‌డంలో భాగంగా, సీఎల్పీని విలీనం చేసేందుకు కేసీఆర్ న‌డుం భిగించారు. తాజాగా మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేల‌ను త‌మ గూటికి లాగేస్తున్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈ జాబితాలో ఉన్నారని ప్ర‌చారం జ‌ర‌గ‌గా...వారికంటే ముందే తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జంప్ అయిపోతున్నారు. రోహిత్ రెడ్డి ప్రగత్‌ భవన్‌కి వెళ్లి ఈ రోజే టీఆర్ఎస్ పెద్ద‌ల‌ను క‌లుస్తార‌ని ప్ర‌చారం జరుగుతుండ‌గా...ఒకటి రెండు రోజుల్లో పార్టీలో చేరే విషయం చెబుతానని రోహిత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. రోహిత్‌తో పాటుగా మిగ‌తా ఇద్ద‌రి చేరిక‌తో శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనుంది. జూన్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండ‌గా ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు  కేసీఆర్ త‌గు ప్ర‌క్రియ పూర్తి చేయ‌నున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ ముగ్గురు పార్టీ మారితే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన వారి సంఖ్య 14కు చేర‌నుంది. దీంతో కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English