సోష‌ల్ సైన్యానికి జ‌గ‌న్ థ్యాంక్స్!

సోష‌ల్ సైన్యానికి జ‌గ‌న్ థ్యాంక్స్!

స్వార్థం లేని రాజ‌కీయం ఎక్క‌డా క‌నిపించ‌దు. అందుకు భిన్నంగా ఎలాంటి స్వార్థం లేకుండా.. యువ‌నేత మీద అంతులేని అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించిన సోష‌ల్ సైన్యానికి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పారు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చారిత్ర‌కంగా వెలువ‌డ‌టం వెనుక జ‌గ‌న్ ఇమేజ్ తో పాటు.. సోష‌ల్ మీడియా కూడా కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎలాంటి ప‌ద‌వుల్ని.. మ‌రెలాంటి ప్ర‌యోజ‌నాల్ని ఆశించ‌కుండా కేవ‌లం జ‌గ‌న్ మీద ఉన్న అభిమానంతో సైన్యం మాదిరి ప‌ని చేసిన సోష‌ల్ మీడియాలోని జ‌గ‌న్ అభిమానుల‌కు యువ సీఎం జ‌గ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న విజ‌యంలో వారు ప‌డిన శ్ర‌మ త‌న‌కు తెలుస‌ని పేర్కొన్నారు.

ఎల్లో మీడియాకు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు.. సోష‌ల్ మీడియా సైన్యం అనుస‌రించిన విధానాన్ని తాను మ‌ర్చిపోలేన‌న్నారు. మీ అభిమానానికి కృత‌జ్ఞ‌త‌లు.. మీరు ఇదే తీరును అందించాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లుగా ట్వీట్ లో పేర్కొన్నారు.

జ‌గ‌న్ ప‌థ‌కాల్ని.. ఆయ‌న మాట‌ల్ని సామాన్య‌లకు ఎప్ప‌టిక‌ప్పుడు చేర‌దీయ‌ట‌మే కాదు.. చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు లోకేశ్ చేసే త‌ప్పుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు  ఎత్తి చూపిస్తూ.. వారిని డ్యామేజ్ చేయ‌టంతో పాటు.. ఎల్లో మీడియా స్వార్థాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూప‌టంలో సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ చేసిన కృషి కీల‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English