పోలీసుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతోన్న ర‌విప్ర‌కాశ్‌!

పోలీసుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతోన్న ర‌విప్ర‌కాశ్‌!

ప‌లు నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న‌సంగ‌తి తెలిసిందే. మీడియా ప్ర‌ముఖుడిగా ఆయ‌న‌కున్న ఇమేజ్ కు భిన్నంగా టీవీ9 ఎపిసోడ్ విష‌యంలో ఆయ‌న వాద‌న‌కు ఎవ‌రూ అండ‌గా నిల‌వ‌ని ప‌రిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇస్తే.. 27 రోజుల పాటు ప‌త్తా లేకుండా పోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఆయ‌న్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విప‌రీతంగా ప్ర‌య‌త్నాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ ర‌విప్ర‌కాశ్ ఆచూకీ ల‌భించ‌లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంచ‌నాల‌కు భిన్నంగా నేరుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కు వెళ్లిన ర‌విప్రకాశ్.. పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. తొలిరోజు దాదాపుగా ఐదు గంట‌లు.. రెండో రోజు సుమారు ప‌ది గంట‌ల పాటు పోలీసుల విచార‌ణ ఎదుర్కొన్న ఆయ‌న.. త‌న తీరుతో విచార‌ణ అధికారుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఏ ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌క పోవ‌టం.. కీల‌క‌మైన ప్ర‌శ్న‌ల‌కు మాట త‌ప్పించ‌టం చేస్తున్న ర‌విప్ర‌కాశ్ తీరును గుర్తించిన పోలీసులు.. వ‌ద‌ల‌కుండా ప్ర‌శ్న‌లు అడుగుతున్నా.. ఆయ‌న నుంచి స‌మాధానాలు రాబ‌ట్ట‌టం చాలా క‌ష్టంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు త‌న‌కు తెలీద‌ని చెప్ప‌టం.. త‌న లాయ‌ర్ బ‌దులిస్తార‌నిచెప్ప‌టంతో పాటు.. గుర్తు లేద‌ని చెబుతున్నార‌ట‌.

ర‌విప్ర‌కాశ్ తీరుతో చిరాకు చెందిన పోలీసులు.. చివ‌ర‌కు వారు విడుద‌ల చేసే నోట్ లోనూ ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం. ఇదే తీరులో ర‌విప్ర‌కాశ్ వ్య‌వ‌హ‌రిస్తే.. అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌ట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఒక‌వైపు పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌ని ర‌విప్ర‌కాశ్‌.. మ‌రోవైపు పోలీసుల విచార‌ణ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే సంద‌ర్భంలో మాత్రం.. మీడియా.. మాఫియా పేరుతో చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. మొత్త‌మ్మీదా చూస్తే త‌న తీరుతో పోలీసులకు చుక్క‌లు చూపిస్తున్న ర‌విప్ర‌కాశ్ విష‌యంలో విచార‌ణ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English