కాంగ్రెస్... పడి, లేచి మళ్లీ పడింది

కాంగ్రెస్... పడి, లేచి మళ్లీ పడింది

తెలంగాణలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా తనకు తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలుకుతుందని భావించిన కాంగ్రెస్ కు శరాఘాతమే తగిలింది. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో అయినా ఓ మోస్తరు విజయం దక్కుతుందన్న భావన కలిగింది. అయితే టీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యూహం ముందు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పరాజయమే స్వాగతం పలికింది. సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి టీడీపీతో జట్టు కట్టిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఛీకొట్టేసినంత పనిచేశారు.

సరే... అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా... తాజా సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓ మూడు ఎంపీ సీట్లను గెలిచిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకున్నట్లుగానే కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాస్తంత మంచి ఫలితాలనే సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో దారుణాతి దారుణంగా ఓడిపోయింది. అంటే... తెలంగాణలో ఆ పార్టీ ఓ సారి పడి, మళ్లీ లేచి, మరోమారు పడిపోయిందన్న మాట. మంగళవారం విడుదలైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ జిల్లాను కూడా దక్కించుకోలేకపోయింది.

మొత్తం 33 జిల్లాలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క జిల్లానూ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. జడ్పీటీసీ ఫలితాల్లో ఈ మేర ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ ఎంపీటీసీ ఫలితాల్లో మాత్రం ఓ మోస్తరు సీట్లను దక్కించుకుని బతుకు జీవుడా అంటూ బయటపడింది. ఈ లెక్కన చూస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అత్యంత కష్టమైన పనేనన్న మాట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English