సల్మాన్ ఖాన్ కూడా ఏసుకున్నాడుగా

 సల్మాన్ ఖాన్ కూడా ఏసుకున్నాడుగా

ఇప్పుడు చాలామంది నిర్మాతలను హీరోలను ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే.. 'మూవి రివ్యూస్'. రిలీజైన రోజునే సినిమా బాగుంది బాలేదు అని తేల్చేస్తే, కలక్షన్లు మిస్సయిపోతున్నాం అంటూ ఫీలవుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా జాయినయ్యాడు. తన కొత్త సినిమా 'భారత్' మరో రెండు రోజుల్లో రిలీజవుతున్న తరుణంలో, మనోడు కూడా చివరకు రివ్యూ రైటర్లను ఏసుకుంటున్నాడు.

''ఒక కొత్త బైక్ రిలీజైందనుకోండి.. మీరు గంటలో బైక్ వేస్ట్ వేస్ట్ అంటూ ప్రచారం చేస్తారా? అలాగే సినిమాను కూడా కొన్ని రోజులు వదిలేస్తే బాగుంటుంది. మరీ రిలీజ్ రోజునే అలా రివ్యూలు చెప్పేస్తే ఒక 10% ఆడియన్స్ ఖచ్చితంగా సినిమాను చూడటంపై సెకండ్ ఒపీనియన్ కు వచ్చేస్తారు. నా సినిమాల వరకు రేటింగులు ఎలా ఉన్నాపర్లేదు కాని, ఆ రేటింగుల వలన కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రం చాలా నష్టపోతున్నారు'' అంటూ కామెంట్ చేశాడు సల్మాన్ భాయ్. నిజంగా 10% జనాల మీద మాత్రమే ప్రభావం ఉన్నప్పుడు అంతా ఎందుకు ఫీలవ్వడం భాయ్?

మ్యాటర్ ఏంటంటే.. ఒక కొత్త సెల్‌ ఫోన్ రిలీజైనా దానికి వెంటనే ఇప్పుడు ప్రొడక్ట్ రివ్యూ వచ్చేస్తోంది. బైక్ రిలీజైనా కూడా దానికి మైలేజ్ ఎంతొస్తుంది డ్యూరబులిటి ఎలా ఉంది అంటూ రివ్యూలు వచ్చేస్తున్నాయి. అయితే కొంతమంది జనాలు ఫోన్లో మెమరీ లేకపోయినా కూడా కెమెరా క్వాలిటీ బాగుందని ఐఫోన్ కొన్నట్లు, బైక్ మైలేజ్ రాకపోయినా కూడా స్టయిల్ గా ఉంటుంది యమహా FZR కొన్నట్లు, సినిమాకు సింగిల్ స్టార్ ఇచ్చినా కూడా ధియేటర్లకు వెళుతుంటారు. అందుకే జీరో రేటింగ్ సినిమాలకు కూడా ఒక్కోసారి కోటి రూపాయల కలక్షన్ వస్తుంది. కాబట్టి రివ్యూలను బ్లేమ్ చేస్తే ఎలా?

ఇంతకీ భాయ్ ఇలా రివ్యూల మీద సీరియస్ అయ్యడంటే, 'భారత్' సినిమా ఆల్రెడీ ఒక షో వేసుకుని చూశాడా ఏంటి? లెటజ్ సీ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English